తూర్పుగోదావరి

ఆదాయం మిన్న - సదుపాయాలు సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ తరువాత ప్రభుత్వానికి అదే స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చి పెట్టే స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నాయి. దీంతో భూ క్రయ విక్రయాలు సాగించే ప్రజలు తీవ్ర అసహనానికి గురువుతూ ఆ శాఖ తీరును ఎండగడుతున్నారు. ఈ కార్యాలయాల్లో కంప్యూటర్ పనిచేస్తే ప్రింటర్ పనిచేయదు. ప్రింటర్ పనిచేస్తే కంప్యూటర్లు పనిచేయవు. ఆ రెండూ సక్రమంగా ఉంటే స్కానర్ మొండికేస్తుంది. ప్రింటర్లు, స్కానర్ల కోసం సమీపంలోని కార్యాలయాలకు పరుగులెత్తాల్సిన పరిస్థితులు నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రింటర్ పనిచేయక పనులు నిలిచిపోతే ఆ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ భూ విక్రయదారుడు ప్రింటర్‌ను బహుమతిగా ఇచ్చారంటే ఆ శాఖ పనితీరును అర్ధం చేసుకోవచ్చు. ఇక కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించి ఏడాది దాటిందంటే ఈ కార్యాలయాలు సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనవసరం లేదు. కరెంటు పోతే గంటలు తరబడి వేచి ఉండాల్సిందేనంటున్నారు క్రయ విక్రయదారులు. కరెంటు పోయిన సమయంలో విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఇనె్వర్టర్ల కాంట్రాక్టుకు కాలం చెల్లిపోవడంతో అవి మూలన పడి ఏడాది పైనే అయిందని కార్యాలయ సిబ్బంది చెపుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆయా కార్యాలయాల్లో తిష్టవేసిన సమస్యలపై ఎందుకు దృష్టిసారించడం లేదనేది సగటు క్రయ, విక్రయదారుల సూటి ప్రశ్నకు సంబంధిత కార్యాలయాల అధికారుల నుంచి వౌనం తప్ప సమాధానం ఆశించలేము. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 34 సబ్ రిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, వాటిలో రాజమహేంద్రవరం రెవెన్యూ జిల్లాలో 18, కాకినాడ రెవెన్యూ జిల్లాలో 16 కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో అమలాపురం డివిజన్‌లో 10కి పైగా కార్యాలయాలు పనిచేస్తున్నాయి. రోజూ ఈ కార్యాలయాలకు సగటున వందకుపైగా వివిధ రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు వస్తున్నా ఆయా కార్యాలయాల్లో ఉన్న సమస్యల కారణంగా కొన్నిచోట్ల సకాలంలో సేవలందక ఇటు ప్రజలతోపాటు కార్యాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడువులోగా కరెంటు, టెలిఫోన్ బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తున్నారని, తామే చందాలు వేసుకుని బిల్లులు చెల్లిస్తున్నామని, బడ్జెట్ కేటాయింపు జరిగితేనే బిల్లులను చెల్లిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి జరగకుండా ఉంటుందంటే ఎవరు నమ్ముతారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తన ఆవేదనను వ్యక్తం చేయడం కొసమెరుపు.

ఉత్కంఠభరితంగా వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం, ఫిబ్రవరి 15: ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠ పెంచుతూ ఉత్తేజాన్ని కలిగిస్తూ గొల్లవిల్లి జడ్పీ హైస్కూలు మైదానంలో జరుగుతున్న జాతీయ వాలీబాల్ టోర్నమెంట్స్ మూడవ రోజు గురువారం హోరాహోరీగా జరిగాయి. పురుషుల విభాగం కేరళకు చెందిన కెఎస్‌ఇవి జట్టు, కేరళ పోలీసు జట్టు తలపడ్డాయి. రెండింటమధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగినంత సేపు ప్రేక్షకుల్లో ఉత్కంఠ చోటుచేసుకుంది. రెండు జట్లలోను జాతీయ క్రీడాకారులు ఉండటం, పొడవైన క్రీడాకారులు కావడంతో బాలును కింద పడకుండా ఎవరికి వారే వారి ప్రతిభను కనబరిచారు. చివరకు కెఎస్‌ఇబి కేరళ పోలీసు జట్టుపై గెలుపు సాధించింది. స్కోర్ వివరాలు 25-20, 23-25, 25-15, 25-18 తేడాతో గెలుపు సాధించింది. ఈ పోటీలను ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతోపాటు ఎమ్మెల్సీ కెవి వర్మ, కె చైతన్యరాజు, అర్జున్ అవార్డు గ్రహీత రమణారావు తదితరులు వీక్షించారు. వీరందరికీ ఎంవిఆర్ వాలీబాల్ టోర్నీ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు స్వాగతం పలికి ఆతిధ్యాన్ని ఇచ్చారు. అనంతరం మహిళా విభాగంలో కర్ణాటక, ఆంధ్రా జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అయ్యింది.