క్రైమ్/లీగల్

వృద్ధ దంపతులపై దాడి, దోపిడీకి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఫిబ్రవరి 20: పట్టపగలు సైదాబాద్‌లో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంటి వెనుక ద్వారం నుంచి లోపలికి చొరబడి వృద్ధ దంపతులపై విచక్షణ రహితంగా దాడి చేసారు. వృద్ధుల కేకలతో దోపిడీకి విఫలయత్నం చేసి పరారైనారు. స్థానికుల సహకారంతో బాధితులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ డివిజన్ ఫరాకాలనీకి చెందిన ట్రాన్స్‌కో విశ్రాంత ఇంజనీర్ ఎస్.వామన మూర్తి(75) భార్య అనురాధ(65), వారి కుమారుడు, కూతురు ఉద్యోగరీత్యా అమీర్‌పేటలో నివసిస్తున్నారు. బుధవారం ఉదయం వారి ఇంటి వెనుక భాగం నుంచి ఇద్దరు అగంతకులు లోపలికి చొరబడ్డారు. వృద్ధ దంపతులను డబ్బులు, ఎక్కడ, డబ్బులు బయటకు తీయండి అంటూ హిందీలో బెదిరించారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న రోకలి బండతో వామన మూర్తి తలపై రెండు సార్లు బలంగా మోదారు. తమతో తెచ్చుకున్న కత్తితో అనురాధను పొడవబోగా ఆమె చేతులు అడ్డం పెట్టడంతో తీవ్ర గాయాలైనాయి. దంపతుల కేకలతో ఇరుగుపొరుగు అప్రమత్తం అయ్యేలోపు దుండగులు పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావమవుతున్న ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడి జరిగిన ఇంటిని డీసీపీ రమేష్ రెడ్డి, టాస్క్ఫోర్స్ అదనపుడీసీపీ చైతన్య, సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దింపారు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. సైదాబాద్‌లో అగంతకుల దాడిలో గాయపడ్డ వృద్ధ దంపతులను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని యశోద ఆసుపత్రి వైద్యులకు సూచించారు.