క్రీడాభూమి

హాకీ ఇండియా లీగ్ యుపిపై ఢిల్లీ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 23: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ (యుపి) విజార్డ్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ 3-1 తేడాతో గెలిచింది. ఢిల్లీకి ఇది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండో విజయం. యుపి రెండు వరుస విజయాలను సాధించిన తర్వాత తొలిసారి ఓటమిని ఎదుర్కొంది. మ్యాచ్ మొదటి క్వార్టర్ ఆటలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్ చివరిలో రూపీందర్ పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఢిల్లీకి ఒక గోల్‌ను అందిచాడు. నాలుగో క్వార్టర్ చివరిలో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా పోరాటం సాగించాయి. 59వ నిమిషంలో స్టీవెన్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్ సాధించాడు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఫలితంగా ఢిల్లీ 3-0 ఆధిక్యానికి దూసుకెళ్లింది. చివరి క్షణంలో పియెల్ గంజాలో ద్వారా యుపికి ఒక గోల్ లభించింది.