పశ్చిమగోదావరి

యువతుల అక్రమరవాణా పుకార్లు హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 27: యువతుల అక్రమ రవాణా జరుగుతోందంటూ ఒక మహిళ ఫోన్‌కాల్‌కు పోలీసులు శరవేగంగా స్పందించి పరిశీలన చేశారు. అయితే చివరకు యువతుల అక్రమ రవాణా కాదని తేలటంతో వెనుదిరిగారు. అయితే ఈ పరిణామాలు నగరంలో దాదాపుగా సంచలనానే్న సృష్టించాయి. అదికూడా స్ధానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయం వద్ద జరుగుతోందంటూ ఫిర్యాదు రావటంతో అటు పార్టీల నాయకులు, ఇటు పోలీసు ఉన్నతాధికారులు రంగప్రవేశం చేయటంతో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించే పరిస్దితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్ధానిక ఎన్‌ఆర్ పేటలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయం ఉంది. శనివారం విశాఖపట్నంలో మహిళా సదస్సు జరుగుతుండటంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అక్కడకు విద్యార్ధినులను తీసుకువెళ్తున్నారు. అవిధంగానే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధినులు ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయానికి చేరుకున్నారు. దీన్ని చూసి ఒక మహిళ అక్రమ రవాణా చేస్తున్నారంటూ పోలీసులకు ఫోన్ చేసింది. వెనువెంటనే ఏలూరు డిఎస్పీ కెజివి సరిత ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఆప్రాంతానికి చేరుకున్నాయి. విద్యార్ధినులతో స్వయంగా డిఎస్పీ మాట్లాడారు. అలాగే వారి తల్లిదండ్రులు, హాస్టళ్ల వార్డెన్లతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. చివరకు వారంతా అధీకృతంగానే విశాఖపట్నం సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు నిర్దారించారు. అనంతరం ఈవిషయంలో అక్రమరవాణా ప్రసక్తే లేదని తేలటంతో ఫిర్యాదు చేసిన మహిళ వివరాలను ఆరా తీస్తున్నారు.