ఆంధ్రప్రదేశ్‌

కాలేజీ ఆవరణలో విద్యార్థినిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 17: కళాశాల ఆవరణలో విద్యార్థినిపై ఓ యువకుడు సుత్తితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు కొత్తపేట సిఐ వెంకన్నచౌదరి మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో గల సిసి కెమేరాల పుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. గుంటూరు నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... గురువారం గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలోని సైకిల్ స్టాండ్‌లో డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థిని వెంకటరమణ సైకిల్ పెడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఓ యువకుడు సుత్తితో బలంగా తలపై మోది పరారయ్యాడు. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన వెంకటరమణకు తల్లిదండ్రులు లేరు. బంధువుల సహాయంతో చదువుకుంటున్న విద్యార్థిని గుంటూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంగా ఉండే మహిళా ప్రాంగణంలో నివాసం ఉంటోంది. గురువారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థిని సైకిల్ స్టాండ్ వద్ద సైకిల్ నిలుపుతున్న సమయంలో ఆ దుండగుడు సుత్తితో తలపై కొట్టాడు. తీవ్ర గాయపడిన ఆ విద్యార్థినిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తరలించారు.