Others

హాట్’దేరిన హంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంసానందిని రొట్టె విరిగి ఐటెమ్‌లో పడినట్టుంది. ఐటెమ్ పెర్ఫారెన్స్‌లో హాటు’దేరిపోయిన హంసకు -వరుసపెట్టి హాట్‌హాట్ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అల్లు శిరీష్‌తో పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఐటెమ్ సాంగ్‌కు ఓకె చెప్పిందని అంటున్నారు. అందుకు బోనస్‌గా ఆమెతో చిన్న పాత్ర కూడా చేయిస్తున్నట్టు వినికిడి. ఇటీవలి కాలంలో హంస ఐటెమ్ సాంగ్స్ చేసిన చిత్రాలకు -మంచి పేరే వస్తుండటంతో దర్శకులు ఆమెవైపు ఆసక్తిగానే చూస్తున్నారు. మొన్నటికి నిన్న -బెంగాల్ టైగర్ టైటిల్ సాంగ్‌లో రవితేజతో ఆడిపాడిన హంస, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయిన చిత్రంలోనూ ఐటెమ్‌తో హీటెక్కించనుందట. ఒడ్డూ పొడుగుతోపాటు బొండుమల్లెలాంటి అందంతో ఆకట్టుకుంటున్న హంసకు -ఐటెమ్స్ క్రేజ్ బాగానే వచ్చేసింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకునే -హంస కోసమే ఐటెమ్స్ సృష్టిస్తున్నారు. హాట్‌హాట్ అవకాశాలతో -హంస కెరీర్ కూల్‌గా సాగిపోతోంది.