ఆంధ్రప్రదేశ్‌

వికలాంగులు కాదు...విభిన్న ప్రతిభావంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని జిల్లాల్లో ప్రత్యేక హోంలు ఏర్పాటు
రూ.2.70 కోట్లతో బ్రెయిలీ ప్రెస్
రూ.100 కోట్లతో విశాఖలో ప్రత్యేక క్రీడా ప్రాంగణం
వికలాంగుల దినోత్సవంలో సిఎం చంద్రబాబు

విజయవాడ, డిసెంబర్ 3: ఇకపై వికలాంగుల్ని విభిన్న ప్రతిభావంతులుగా రాష్ట్రంలో వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ప్రపంచ వికలాంగుల సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా బతికేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో మోడల్‌గా నెల్లూరు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలో అంగవైకల్యంతో బాధపడేవారికి ప్రత్యేక హోంలు ఏర్పాటు చేస్తామన్నారు. అంధుల కోసం కాకినాడ, అనంతపురంలో ప్రత్యేక హోంలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి రాజధానికి సమీపంలో విజయవాడలో ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని గ్రూప్-1, గ్రూప్-2లతో బాటు, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తగు శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల సందర్భంలో సాధారణ అభ్యర్థుల కంటే వికలాంగ అభ్యర్థులకు 20 నిముషాల సమయం అదనంగా ఇచ్చేందుకు ఉత్పత్తులు ఇస్తామన్నారు. వికలాంగులకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్చర్‌కు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు.
గుంటూరులో రూ.2కోట్ల 70 లక్షల్లో బ్రెయిని ప్రెస్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో 100 కోట్లతో విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల) కోసం క్రీడా ప్రాంగణం (స్పోర్ట్స్ కాంప్లెక్స్) నిర్మిస్తామన్నారు. అదే విధంగా 10 కోట్లతో కర్నూలులో సెన్స్‌రి పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వికలాంగుల్ని వివాహం చేసుకున్న వారికిచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి లక్షకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో 5 లక్షల 47వేల మంది వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నామని నూరు శాతం 80 శాతం మించిన వారికి రూ.1500, 40 శాతం మించిన వారికి 1000 చొప్పున పెన్షన్లు ఇస్తున్నామన్నారు. బాల్యంలో స్వల్పమైన ఆరోగ్యపరమైన, లోపాల వల్ల సంభవించకుండా రాష్ట్రంలో సర్జికల్ కలెక్షన్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే ప్రపంచ వికలాంగుల సమావేశం నాటికి ప్రభుత్వ ప్రోత్సాహంతో వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారిని సమావేశంలోని ఇతరులందరికీ పరిచయం చేయాలని వికలాంగ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వికలాంగులు స్ర్తి, శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేసి వారిలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 13 జిల్లాలకు చెందిన వ్యక్తులకు విభిన్న ప్రతిభావంతులకు వారందించిన సేవలు, పనితీరు ఆధారంగా అవార్డులను ప్రకటించడం జరిగింది. వేడుకల్లో భాగంగా విశాఖపట్నానికి చెందిన అంధ పాఠశాలకు చెందిన విద్యార్థినులు, జాతీయ గీతాలాపన చేసి సభికులను ఆకర్షించారు. విద్యార్థినులు పి.అనూష, జె.గౌరి, ఎం.రూపలతో కలిసి ముఖ్యమంత్రి కేక్‌ను కట్‌చేసి వారికి స్వయంగా తినిపించారు. సాంకేతిక విద్యలో ప్రతిభా పాటవాలు చూపిన విభిన్న ప్రతిభావంత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రమణమూర్తి, ఇన్‌చార్జి కలెక్టర్ గంథం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపకరణాల పంపిణీ
1039 మంది వికలాంగులకు ఒక కోటీ ఐదు లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేశారు. 300 మందికి ట్రైసైకిళ్లు, 50 మందికి వీల్‌చైర్లు, 150 మందికి క్రచర్స్, 200 మందికి ఫైవ్‌ఫోల్డ్ వాకింగ్ స్టిక్స్, 250 మందికి వినికిడి యంత్రాలు అందజేశారు.