జాతీయ వార్తలు

వీర జవాను హనుమంతప్ప కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ సరిహద్దుల్లోని సియాచిన్‌లో మంచు చరియల్లో చిక్కుకుని ఆరురోజుల తర్వాత బయటపడిన వీర సైనికుడు లాన్స్ నాయక్ గురువారం తుదిశ్వాస విడిచాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను సియాచిన్ నుంచి హెలికాప్టర్ ద్వారా దిల్లీలోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించి కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హనుమంతప్ప బతకాలని దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రార్ధనలు చేశారు. మూత్రపిండాలు, కాలేయం పనిచేయక పోవడంతో ఆయనకు వైద్యులు కృత్రిమశ్వాస అమర్చి డయాలసిస్ చేస్తూ వచ్చారు. ఆయనకు అవయవదానం చేసేందుకు యుపిలోని ఓ మహిళ ముందుకు వచ్చింది.
మంచు చరియల్లో కూరుకుపోయిన బయటపడిన ఆయనను అందరూ ‘మృత్యుంజయుడు’గా అభివర్ణించారు. ఆయన క్షేమంగా బతికిబయటపడేందుకు ప్రార్ధనలు చేయాలని ప్రధాని మోదీ సైతం జాతికి పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో కాదు.. మృత్యువుతోనూ అలుపెరుగక పోరాడిన హనుమంతప్ప చివరికి ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.