రాష్ట్రీయం

ఏపి కోస్ట్‌గార్డ్ కమాండర్‌గా హర్బోలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 21: కోస్ట్‌గార్డ్ (ఆంధ్రప్రదేశ్) కమాండర్‌గా డిఐజి ఎకే హర్బోలా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిఐజి జెఎస్ సబర్వాల్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సబర్వాల్ మహారాష్ట్ర కోస్ట్‌గార్డ్ కమాండర్‌గా బదిలీ అయ్యారు. హర్బోలా వర్జీనియాలోని యుఎస్ కోస్ట్‌గార్డ్ మిలటరీ స్కూల్‌లో శిక్షణ పొందారు. సికిందరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లోను, ఢిల్లీలోని నేషన్ డిఫెన్స్ కాలేజీలో కూడా శిక్షణ పొందారు. భారత రాష్టప్రతి నుంచి తట్క్ష్రక్ మెడల్‌ను కూడా పొందారు.