జాతీయ వార్తలు

హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేంద్రనగర్: పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా బల్దానా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చెంప మీద కొట్టాడు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన ఆకర్ష్ ర్యాలీలో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. పటేల్ కాంగ్రెస్‌లో చేరినందునే తాను కొట్టానని ఆ వ్యక్తి చెప్పారు. ర్యాలీలో హర్దిక్ పటేల్ మాట్లాడుతుండగా ఇంతలో ఓ వ్యక్తి ఒక్కసారిగా వేదికపైకి వచ్చి హార్దిక్ చెంపపై కొట్టాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. మూకదాడిలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి బట్టలు పూర్తిగా చినిగిపోయాయి. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.