తెలంగాణ

అక్కసుతోనే విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, మార్చి 11: మహారాష్టత్రో ఒప్పందంపై కాంగ్రెస్ చౌక బారు విమర్శలు చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒప్పందం చారిత్రాత్మకం అని అన్నారు. అంతర్ రాష్ట్ర వివాదాలకు స్వస్తి పలుకుతూ కొత్త ఒరవడి సృష్టించినట్టు చెప్పారు. గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ఒక్క వివాదాన్ని కూడా పరిష్కరించలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై బురద జల్లేలా పాత ఒప్పందానే్న తిరిగి సంతకాలు చేసుకున్నారని అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. పదేళ్ల నుంచి తుమ్మడి హట్టి బ్యారేజీ నిర్మాణం ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎఫ్‌ఆర్‌ఎల్‌తో కాల్వల డిజైన్ పూర్తి చేసి టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించారని, మహారాష్టన్రు ఒప్పించాల్సిన అవసరం మరిచిపోయారని అన్నారు. ఒప్పందంపై విమర్శలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, తుమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి 2012లో ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న దానిలో వాస్తవం లేదని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో జరిగిన ఒప్పందం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ఒక్కటేనని హరీశ్‌రావు తెలిపారు. గోదావరి ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చిన ఒప్పందం పాత ఒప్పందం ఎలా అవుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు.