భక్తి కథలు

హరివంశం 206

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్రుడు అంగిరసుడి శిష్యుడు కాబట్టి బృహస్పతికి జరిగిన అన్యాయానికి గర్హించి దేవగురువు పక్షం వహించాడు. శుక్రుడి పట్ల తన కుండే మక్కువతో పరమశివుడు బృహస్పతి పక్షంలో చేరాడు. అప్పుడాయన అజగవమనే మహా ధనుస్సు ధరించి బృహస్పతి విరోధి వర్గాన్ని చీల్చి చెండాడాడు.
చంద్రుడు చేసిన అపరాధాన్ని పట్టించుకోకుండా అతడి పక్షం వైపే మొగ్గుచూపుతున్నారని రుద్రుడు కోపించి బ్రహ్మ శిరమనే అస్త్రాన్ని దేవతలపై ప్రయోగించాడు. వారు అశక్తులైనారు. స్తంభించిపోయినారు. ఇదే అదనుగా చూసుకొని అసురులు విజృంభించారు. దేవవర్గం శక్తిహీనమైనందున క్రమంగా నాశం పొందుతూ వచ్చారు.
అప్పుడు ఘోరమైన యుద్ధం జరిగింది ఇరుపక్షాలవారికి. లోకాలన్నీ సంక్షోభించే ఈ దారుణ రణరంగంలో పూర్తిగా దేవతలు పరాజయం పాలైనారు. అసంఖ్యకంగా మరణించారు. దైతులఢాకకు నిలువలేక హతశేషులు వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు మహాదేవుణ్ణి ప్రార్థించి యుద్ధం నిలిచిపోయేట్లు చేశాడు.
ఆ తరువాత శుక్రుణ్ణి పంపించి చంద్రుణ్ణి సమాధానపరిచి తారను తీసుకొని వచ్చేట్లు చేసి బృహస్పతికి ఆమెను అప్పగించాడు బ్రహ్మదేవుడు. అప్పటికే తార గర్భం ధరించి వుంది. బృహస్పతి తార కడుపులో వున్న శిశువు తన శిశువు కాదన్నాడు. అప్పటికే తార అంతర్వత్నియై తొమ్మిది నెలలు సంపూర్ణమైనాయి. ఆమె సిగ్గూ, భీతి, లోకాపవాదం భరించలేక ఒక రహస్య స్థలానికి వెళ్ళి గర్భపాతం చేసుకున్నది.
అట్లా జన్మించిన ఆ శిశువు గొప్ప తేజస్సుతో ప్రకాశించాడు. అనుపమాన సౌందర్య తేజస్సుతో సమస్త దేవలోకాన్ని ఆకర్షించాడు. ఇటువంటి శిశువును ఎక్కడా చూడలేదు ఇంతవరకు అని చాలా సంభ్రమం చెందారు. అందరికళ్ళూ ఆ కుమారుడిపైనే వున్నాయి. వాళ్ళప్పుడు తారను అడిగారు. నిజం చెప్పు. నీకేమి మొప్పం కలగదు అని. కాని ఆమె తల వంచుకొని ఆ విషయం చెప్పటానికి బిడియపడింది. ఆ శిశువు తన తల్లిని చూసి కొరకొరలాడాడు. ఆ పిల్లవాడి చూపులు తన తల్లినే శాపగ్రస్తురాలినిగా చేసేట్లు ఉండటం చూసి వేల్పులంతా కలత చెందారు.
అపుడు బ్రహ్మదేవుడు తారను చేరపిలిపించి బుజ్జగింపుగా, మన్ననగా, మృదువుగా ఎవరి శిశువు? అని అడుగా ఆమె లజ్జాత్కంఠితురాలై చంద్రుడి శిశువే అని చెప్పింది. అపుడు సోముడు ప్రేమోత్కంఠితుడై ఆ శిశువునెత్తుకొని ఎదకు హత్తుకొని తనతో తీసుకొనిపోయినాడు. ఈ పిల్లలవాడికి బుధుడని పేరు పెట్టాడు చంద్రుడు. తార మళ్ళీ బృహస్పతితో వెళ్లిపోయింది. దేవతలు, మునులు బుధుడిపట్ల ప్రేమాభిమాన వాత్సల్యాదరాలు చూపారు.
పంచ మహాపాతకాలలో ఒకటైన మహాపాపం చంద్రుడు ఒడిగట్టినందువల్ల ఆయనకు క్షయ వ్యాధి పట్టుకొని పీడించింది. రోజురోజుకూ ఆయన క్షీణించిపోయాడు. భయపడిపోయిన తన తండ్రి అయిన అత్రి మహామునిని చంద్రుడాశ్రయించాడు. అత్రి మహాముని సోముడి పాప పరిహారం చేశాడు. అంతట సోముడు మళ్లీ దినదినాభివృద్ధి చెందుతూ పూర్వంకన్నా మరింత తేజోవంతుడైనాడు.
బుధుడి కుమారుడు పురూరవుడు. త్రిలోక విశ్రుతుడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. గొప్ప విభవంతో శౌర్య పరాక్రమాలతో విలసిల్లాడు. ఆర్తరక్షా పరాయణుడని నుతికెక్కాడు. ఆయనతో యుద్ధాలలో ఎవరూ ఎదురు నిల్వలేరని ప్రస్తుతి పాత్రుడైనాడు. ధర్మం మూర్త్భీవించినవాడని వినుతికెక్కాడు. పరమోదాత్తుడని పేరు పొందాడు. ఆత్మ తత్వవిదుడు, పరమార్థవేది అని లోకంలో కీర్తి సాధించాడు.

ఇంకా ఉంది