క్రీడాభూమి

సౌరెజ్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ క్లబ్ కప్ ఫుట్‌బాల్
* ఫైనల్‌కు దూసుకెళ్లిన బార్సిలోనా
యొకహమా, డిసెంబర్ 17: ప్రపంచ మేటి క్లబ్‌లలో ఒకటైన బార్సిలోనా మరోసారి సత్తా చాటింది. ఇక్కడి ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో గాంగ్జూ ఎవర్‌గ్రాండె ఫుట్‌బాల్ క్లబ్‌ను 3-0 తేడాతో ఓడించింది. లూయిస్ సౌరెజ్ హ్యాట్రిక్‌తో బార్సిలోనాను విజయపథంలో నడిపాడు. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అనారోగ్యం కారణంగా మైదానంలోకి దిగలేదు. అతను లేకపోయినప్పటికీ మిగతా ఆటగాళ్లంతా వ్యూహాత్మకంగా కదులుతూ గాంగ్జూపై మొదటి నుంచే ఒత్తిడిని పెంచారు. 39వ నిమిషంలో ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించిన సౌరెజ్ తొలి గోల్ చేశాడు. ఆతర్వాత బార్సిలోనా డిఫెన్స్‌కు పరిమితంకాగా, గాంగ్జూ ఆటగాళ్లు ఈక్వెలైజర్ కోసం పోరాటం సాగించారు. అయితే, వారికి బార్సిలోనా ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు.
ద్వితీయార్ధం మొదలైన వెంటనే బార్సిలోనా మరోసారి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మెరుపువేగంతో ముందుకు కదిలిని సౌరెజ్ 50వ నిమిషంలో చేసిన గోల్‌తో ఆ జట్టు 2-0 ఆధిక్యానికి వెళ్లింది. గాంగ్జూ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలంకాగా, 67వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలచిన సౌరెజ్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. సెమీస్‌లో 3-0 తేడాతో నెగ్గిన బార్సిలోనా ఆదివారం జరిగే టైటిల్ పోరులో రివర్ ప్లేట్‌ను ఎదుర్కొంటుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రివల్ ప్లేట్ జట్టు సాన్‌ఫ్రెస్సే హిరోషిమాను 1-0 తేడాతో ఓడించింది. లుకాస్ అలారియో కీలకమైన ఈ గోల్ సాధించి రివర్ ప్లేట్‌ను ఫైనల్ చేర్చాడు. గత ఏడాది సాన్ లొరెన్జోను 2-0 తేడాతో ఓడించిన రియల్ మాడ్రిడ్ చాంపియన్‌గా నిలిచింది. అయతే, ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బార్సిలోనా ముచ్చటగా మూడోసారి టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. రివర్ ప్లేట్‌తో పోలిస్తే బార్సిలోనా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. మెస్సీ అనారోగ్యం నుంచి కోలుకొని మ్యాచ్ ఆడితే, బార్సిలోనా దూకుడును రివర్ ప్లేట కళ్లెం వేయడం దాదాపు అసాధ్యమే. హాట్ ఫేవరిట్‌గా బార్సిలోనా ఫైనల్‌కు సిద్ధమవుతున్నది.
(చిత్రం) హ్యాట్రిక్ హీరో లూయిస్ సౌరెజ్