సంజీవని

గుంఢె గుట్టు తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగా గుండె ముడుచుకుని రక్తాన్ని రక్తనాళాలలోకి ఓ అలలా నెడుతుంది. దీనే్న పల్స్ అంటారు. మణికట్టు దగ్గర పెద్ద ఆర్టెరీ వుంటుంది కాబట్టి అక్కడ పట్టుకొని పల్స్ రేట్‌ని తేలిగ్గా తెలుసుకోవచ్చు. అరచేతివైపు చూస్తారు. 15 సెకెండ్లకి ఎన్ని పల్స్ వస్తాయో చూసి 4తో హెచ్చిస్తే నిమిషానికి ఎన్ని పల్స్ వేగంతో గుండె పనిచేస్తోందో తెలుస్తుంది.
సాధారణంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. వ్యక్తినుంచి వ్యక్తికి వస్తే, కొంత తేడా కనిపిస్తుంది. అంతేకాదు, ఒకే వ్యక్తిలో ఒకే రోజులో కూడా తేడాలు కనిపించవచ్చు. పిల్లల్లో గుండె కొట్టుకోవడం ఎక్కువగా వుంటుంది. నిమిషానికి 90 నుంచి 120దాకా ఉండవచ్చు. శిక్షణ పొందిన క్రీడాకారులలో పల్స్ 40కూడా వుంటుంది. విశ్రాంతిలో వున్నపుడు పల్స్ తగ్గుతుంది. ఏదైనా వ్యాయామం చేస్తున్నా, కోపం వచ్చినా, భయపడినా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. పల్స్ రేటు పెరుగుతుంది. పెద్దవారిలో పల్స్ రేట్ 60 నుంచి 100 వరకు నిమిషానికి వుంటే వైద్యులు మామూలుగా వున్నట్లు భావిస్తారు.
గుండె ముడుచుకున్నపుడు ఏ వేగంతో రక్తాన్ని పంప్ చేస్తుందో అది రక్తపోటు. గుండె ఒక్కోసారి కొట్టుకునేటపుడు మారుతుంటుంది. ఎక్కువలో ఎక్కువగా 120 మి.మీ (మెర్క్యురీ) వుండాలి. గుండె రిలాక్స్ కాగానే రక్తపోటు 80 మి.మీ ఉండవచ్చు. దీనినే వైద్యులు 120/80 అంటుంటారు. వయసునుబట్టి ఈ రక్తపోటు మారుతుంటుంది. పరిగెత్తేటప్పుడు, ఒత్తిడిలో, తీవ్రంగా చర్చ చేసేటపుడు రక్తపోటు పెరుగుతుంటుంది.
140/90 కన్నా రక్తపోటు అధికంగా వుంటే అధిక రక్తపోటుగా లెక్క. కాస్త రక్తపోటు తగ్గినా పెద్ద సమస్య కాదు కానీ ఎక్కువవుతుంటే కష్టం.
గర్భం వచ్చిన స్ర్తిలు ప్రారంభ దశలో మద్యం ఎక్కువగా సేవిస్తే గర్భంలోని శిశువు గుండె దెబ్బతింటుంది. మద్యం సేవించే తల్లులకు పుట్టిన పిల్లలకు పుట్టుకతోనే కొన్ని గుండె జబ్బులుంటున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. మద్యం గుండె పనితీరును దెబ్బతీస్తుంది. గుండె కండరాలు దెబ్బతింటాయి. కొట్టుకోవడంలో తేడా వస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. మోతాదు ప్రకారం తాగితే హెచ్‌డిఎల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మనం బరువు పెరిగినకొద్దీ ఆ భారం గుండెమీద పడుతుంది. ఉండాల్సిన బరువుకన్నా ఒక్క కిలో బరువు ఎక్కువగా వుంటే గుండెకి రోజుకి రక్తనాళాలలో 150 కి.మీ ఎక్కువ దూరం నెట్టే పని పడుతుంది. అందుకని బరువు పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరిగితే రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మధుమేహం రావచ్చు.
కొన్ని అనారోగ్యాలలాగానే అధిక రక్తపోటు వంశపారంపర్యంగా వస్తుంటుంది. మైట్రల్ వాల్వ్ దెబ్బతినడం వంశపారంపర్యంగా చూస్తుంటాం. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా వుండడం కూడా వంశపారంపర్యంగా రావచ్చు. హార్ట్ ఎటాక్, కొన్ని పుట్టుకతో గుండె జబ్బులు వంశపారంపర్యంగా రావచ్చు.
వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించి చికిత్స చేయించాలి. కొన్ని గుండె జబ్బులు వత్తిడి పెంచుకోవడం, కోపం లాంటి లక్షణాలు, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లవల్ల వస్తాయి. అలవాట్లు వుంటే గుండె జబ్బుల్ని కొనితెచ్చుకోవడమే. కాబట్టి వీటికి దూరంగా వుండడం మంచిది.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638