సంజీవని

గుండెజబ్బులతో మరణాలు అధికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో హృదయ సంబంధ వ్యాధులు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఇటీవల జరిపిన అధ్యయనంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులే మరణానికి ప్రధాన కారణమవుతున్నాయని తేలింది. గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులన్నీ ఒకేలా ఉండవు. అందువల్ల వాటిని గుర్తించడం, చికిత్స చేయడం నిష్ణాతులైన వైద్యులవల్లే జరుగుతుంది.
మొత్తం మరణాల్లో గుండె, రక్తనాళాల జబ్బులతో సంభవించిన మరణాలు 38 శాతం ఉన్నాయని సర్వేలో తేలింది. ఒక్క భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటిలో ఈ గుండె, రక్తనాళాల జబ్బులు ఎక్కువవుతున్నాయని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన సర్వేలో రక్తప్రసరణ వ్యవస్థలో వస్తున్న మార్పులవల్ల చాలామంది చనిపోతున్నారని తేలింది.
భయపడాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు మన దేశంలో 20 ఏళ్ళవారికే ఈ వ్యాధులు రావడం, టైప్ 2 డయాబెటిస్‌వల్ల, స్థూలకాయంవల్ల ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారు. పట్టణానికి వస్తే వేగంగా పట్టణీకరణ జరగడం, ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా ఉప్పు ఉన్న పదార్థాలను తీసుకోవడంవల్ల గుండె, రక్తనాళాల జబ్బులు ఎక్కువవుతున్నాయి. ప్రాథమిక, సెకండరీ స్థాయిలో వ్యాధిని తెలిసికొని చికిత్స చేయడం కష్టవౌతోంది.