ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో హడలెత్తిస్తున్న ఎండతీవ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలులు వీస్తున్నందున జనం రోడ్డెక్కేందుకు భయపడుతున్నారు. చాలాచోట్ల పగటిపూట రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది. అనంతపురం, నందిగామలో అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ, కర్నూలు, నంద్యాల, తిరుపతిలో 42 డిగ్రీలు, కడప, తుని, జంగమేశ్వరపురంలో 41, నెల్లూరులో 40, బాపట్ల, ఒంగోలులో 39, మచిలీపట్నంలో 38, కాకినాడ, కావలి, నరసాపురం, విశాఖలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.