జాతీయ వార్తలు

సహాయం ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగంలోకి మరో 20 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
10వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కుండపోత వర్షాలు, వరదలకు అతలాకుతలమైన చెన్నై మహానగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయక చర్యలను జాతీయ విపత్తుల సహాయక దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) శుక్రవారం మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న 30 బృందాలకు తోడు అదనంగా మరో 20 బృందాలను రంగంలోకి దింపిన ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇప్పటివరకు పది వేల మందిని కాపాడింది. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడం కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపి సింగ్ సైతం చెన్నైకి వెళ్లారు.
నగరంలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినందున తమ బృందాలు మరింత మందికి చేరువ అవుతాయని భావిస్తున్నట్లు చెన్నై బయలుదేరి వెళ్లడానికి ముందు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సింగ్ చెప్పారు. పాట్నా, పుణె తదితర ప్రాంతాలనుంచి మరిన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలను చెన్నైకి పంపిస్తున్నట్లు, వీరు ఈ రోజు రాత్రికల్లా చేరుకుంటారని ఆయన చెప్తూ, దీంతో మొత్తం దళాల సంఖ్య 50కి చేరుకుంటుందని తెలిపారు. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 10,589 మందిని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ రెస్క్యూ టీమ్‌లకు తోడుగా 131 రబ్బరు బోట్లను, పెద్ద సంఖ్యలో నీళ్లపై తేలే పరికరాలు, లైఫ్ జాకెట్లను కూడా రంగంలోకి దించింది. మనాలి, కుట్టుపురం, గ్లోబల్ హెల్త్ సిటీ ప్రాంతాల్లో చిక్కుపడిన బాధితులకు తమ బృందాలు 1400 ఆహార పూట్లాలు, 2,300 వాటర్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేసినట్లు ఆ ప్రతినిధి చెప్పారు.