క్రీడాభూమి

బాధగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైకి సహాయసహకారాలు అందిస్తాం
*భారత క్రికెటర్లు అశ్విన్, మురళీ విజయ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: చెన్నై మహానగరంలో వర్షం సృష్టించిన విలయం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీమిండియా క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మురళీ విజయ్ అన్నారు. మృతుల సంఖ్య రెండు వందలకుపైగా ఉందని, వేలాది మంది నిరాశ్రయుల్యారన్న వార్తలు తమను ఆందోళనకు గురి చేశాయని ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడుతున్న అశ్విన్, విజయ్ చెప్పారు. పరిస్థితిని తలచుకుంటేనే ఎంతో బాధగా ఉందన్నారు. తమతమ కుటుంబాలు చెన్నైలోనే ఉన్నాయని, విపత్కర పరిస్థితుల్లో తాము వారికి దగ్గరలేనందుకు ఆందోళన చెందుతున్నామని చెప్పారు. త్వరలోనే చెన్నై కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన వీరు, తాము అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తామన్నారు. నటులు సిద్ధార్థ్, ఆర్‌జె బాలాజీసహా కొంత మంది తన మిత్రులు భారీ వర్షానికి సర్వస్వం కోల్పోయిన వారికి సహాయం చేస్తున్నారని అశ్విన్ అన్నాడు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే తాను కూడా వారితో కలిసి సేవలు అందిస్తానని అన్నాడు. చెన్నై ఆపదలో చిక్కుకున్న తరుణంలో, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు స్పందించి, సహాయానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని విజయ్ అన్నాడు. వరదలతో రోడ్డుమీద పడిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించాడు. త్వరలోనే చెన్నైలో సామాన్య పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. సిరీస్ పూర్తయిన వెంటనే చెన్నైలో బాధితులకు సేవలు అందిస్తానని చెప్పాడు. చెన్నైలో ఇలాంటి పరిస్థితిని తాను ఊహించలేదని యువ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే అన్నాడు. ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకుం టుందన్న నమ్మకం ఉందన్నాడు. (చిత్రం) తమిళనాడుకు చెందిన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్ మురళీ విజయ్ (ఫైల్ ఫొటో). వీరి కుటుంబాలు చెన్నైలోనే నివాసం ఉంటున్నాయ. వారి యోగక్షేమాలను అశ్విన్, విజయ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.