క్రైమ్ కథ

పది లక్షల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో మిడ్ వెస్ట్‌లోని ఓ చిన్న గ్రామం అది. దాని రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం ఒకటిం పావుకి ఆగిన రైల్లోంచి ఐదుగురు దిగారు. వారి కోసం ఎదురుచూసే లెఫ్టినెంట్ టామ్ వారి దగ్గరికి వెళ్లి తనని పరిచయం చేసుకుని చెప్పాడు.
‘మిస్టర్ కార్నీ? మీ సమాచారం అందింది’
‘ఏం సమాచారం? కోడ్‌వర్డ్ ఏమిటి?’ అతను అడిగాడు.
‘హేంగోవర్. ప్రెసిడెంట్ కూల్రిడ్జ్ ఇవాళ సాయంత్రం ఐదుంపావు రైల్లో వస్తున్నారు. స్టేషన్ నించి సరాసరి స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని ఆయన రేంచ్‌కి వెళ్తున్నారు అని మాకు మీరు పంపిన సమాచారం అందింది. మీరు కోరిన లిమజిన్ సరిగ్గా నాలుగున్నరకి స్టేషన్ బయట సిద్ధంగా ఉంటుంది’
‘సాయంత్రం నాలుగున్నర తర్వాత పాదచారులు కాని, వాహనాలు కాని ఈ చుట్టుపక్కలకి రాకూడదు’ కార్నీ సూచించాడు.
‘ఆ ఏర్పాట్లు చేశాను’ టామ్ చెప్పాడు.
‘ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రభుత్వ గోల్డ్ బార్స్ ఇక్కడికి వస్తున్నాయా?’ అక్కడికి వచ్చిన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అడిగాడు.
‘సరైన సమయంలో మీకు తెలుస్తుంది. వెళ్లండి’ టామ్ జవాబు చెప్పాడు.
‘ఇటీవల ఎవరైనా కొత్తవాళ్లని చూశారా?’ అతను వెళ్లాక కార్నీ ప్రశ్నించాడు.
‘లేదు. ఈ ఊళ్లోని అన్ని మొహాలు నాకు పరిచయమే’ టామ్ జవాబు చెప్పాడు.
‘కొత్తవాళ్లు ఎవరైనా కనపడితే అదుపులోకి తీసుకుని ప్రెసిడెంట్ వెళ్లాక వదిలేయమని మీ శాఖలోని అందరికీ చెప్పండి. ఆ చిన్న కొండ మీది ఇల్లు ఎవరిది?’ కార్నీ చుట్టూ నిశితంగా చూసి అడిగాడు.
‘అది విల్సన్‌ది. ఆయన కూడా కొంతకాలం సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే రిటైరయ్యాడు. కోడలు, మనవడితో ఉంటున్నాడు. ఈ ఊళ్లో తనిఖీ చేయాల్సిన అవసరం లేని ఏకైక ఇల్లు అదే’
‘విల్సన్, నేను కలిసి పని చేశాం. ఇక్కడ ఉంటున్నాడని తెలీదు. ఆయన్ని చూడాలి’ కార్నీ ఉత్సాహంగా చెప్పాడు.
ఆ సమయంలో ఆ ఇంట్లో విల్సన్ పాడైన టీవీని రిపేర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
‘దాన్ని పారేసి కొత్తది కొనచ్చుగా?’ ఆయన కోడలు మేరీ సూచించింది.
‘రిపేర్ కుదరకపోతే అప్పుడు చూద్దాం’ విల్సన్ చెప్పాడు.
తొమ్మిదేళ్ల పీటర్ తల్లి మేరీని అడిగాడు.
‘నా రివాల్వర్‌ని ఆడుకోడానికి నాకు ఇవ్వకుండా ఎందుకు దాచావమ్మా?’
‘అవును. ఇవ్వచ్చుగా?’ విల్సన్ మనవడికి మద్దతు పలికాడు.
‘మీ అబ్బాయిలా సైనికుడై యుద్ధంలో మరణించడానికా?’ మేరీ బాధగా చెప్పింది.
‘నా కొడుకు డ్యూటీలో ఉండగా యుద్ధంలో మరణించాడు’
‘కాని నా కొడుక్కి ఈ వయసులో తండ్రి అవసరం లేదా?’
విల్సన్ మనవడికి బొమ్మ రివాల్వర్‌ని ఇచ్చి కిటికీలోంచి రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంని చూసి ఆలోచనగా చెప్పాడు.
‘అక్కడ ఏం జరుగుతోంది? స్టేట్ ట్రూపర్స్ ఉన్నారు. చాలా కార్లు కూడా ఉన్నాయి’
* * *
కొద్ది నిమిషాల తర్వాత విల్సన్ ఇంటి బయట ఆగిన కారులోంచి ముగ్గురు దిగారు. వారిలోని లీడర్ జాన్ చేత్తో బ్రీఫ్‌కేస్‌తో దిగాక, ఆ ఇంటిని పరిశీలనగా చూసి తన సహచరులతో చెప్పాడు.
‘లోపలకి వెళ్లాక ఏం చేయాలో తెలుసుగా?’
మిగిలిన ఇద్దరూ తలలు ఊపారు. ఆ ముగ్గురూ ఆ ఇంటి తలుపు దగ్గరికి చేరుకున్నారు. జాన్ డోర్ బెల్‌ని నొక్కాడు.
తలుపు చప్పుడు విని మేరీ తలుపు తెరిచింది.
‘మిసెస్ మేరీ బెన్సన్?’ జాన్ అడిగాడు.
‘అవును. మీరు?’
‘నా పేరు జాన్. నేను ఎఫ్‌బిఐ స్పెషల్ ఏజెంట్‌ని. ఈ ఇద్దరూ మా డివిజన్‌లో పని చేస్తారు’ జేబులోంచి తన ఐడెంటిటీ కార్డ్ తీసి చూపించాడు.
‘నేను పెద్దయ్యాక ఎఫ్‌బిఐలో చేరచ్చా?’ తల్లి వెనక నిలబడ్డ పీటర్ ఆసక్తిగా అడిగాడు.
‘ప్రెసిడెంట్‌వి అవాలని అనుకోవాలి. మేము లోపలకి రావచ్చా?’ జాన్ అడిగాడు.
తన కొడుకుని, విల్సన్‌ని మేరీ పరిచయం చేయగానే విల్సన్ జాన్‌తో కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘1928లో నేను ప్రెసిడెంట్ బాడీగార్డ్‌గా కొద్ది నెలలు పని చేశాను’
‘ఓ! సరే. ఈ ఇంట్లో మీ ముగ్గురూ కాక ఇంకెవరైనా ఉన్నారా?’ జాన్ ఆ హాలంతా పరికించి చూస్తూ అడిగాడు.
అప్పటికే చొరవగా ఆ ఇంటిని కలియ తిరిగిన మిగిలిన ఇద్దరూ వచ్చి చెప్పారు.
‘ఇంట్లో ఇంకెవరూ లేరు. రెండు పడక గదులు, ఓ బాత్‌రూం, ఓ
పోర్ట్ ఉన్నాయి. అనుమానించతగ్గవి ఏం లేవు’
కిటికీ దగ్గరకి వెళ్లి జాన్ రైల్వేస్టేషన్ వైపు చూసి తర్వాత చేతి గడియారం వంక చూసుకున్నాడు. పావుతక్కువ మూడైంది.
‘నేను చెప్పేదాకా మీరు ఇల్లు వదిలి బయటకి వెళ్లకూడదు. బెన్నీ, ఆ బల్లని ఈ కుర్చీ దగ్గరకి జరుపు’ జాన్ చెప్పాడు.
‘దేనికి?’ విల్సన్ అడిగాడు.
‘అఫీషియల్ బిజినెస్. మీరు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఇంకాసేపట్లో మన అధ్యక్షుడు ఈ స్టేషన్‌లో రైలు దిగుతున్నారు. ఎవరైనా ఈ కిటికీలోంచి ఆయన్ని చంపడం తేలిక. ప్రెసిడెంట్ రక్షణ మా బాధ్యత’
‘ఓ! అధ్యక్షుడు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు’ విల్సన్ ఆనందంగా చెప్పాడు.
మళ్లీ తలుపు చప్పుడైతే మేరీ తెరిచింది. లెఫ్టినెంట్ టామ్, కార్నీలు లోపలకు వచ్చారు.
‘నా పేరు కార్నీ. పాతికేళ్ల క్రితం విల్సన్‌తో కలిసి పని చేశాను. ఆయన ఏరి?’ కార్నీ మేరీని ప్రశ్నించాడు.
విల్సన్ వచ్చి కార్నీని కౌగిలించుకుని ఆనందంగా అడిగాడు.
‘హలో యంగ్ బాయ్! ఎలా ఉన్నావు? మనం వైట్‌హౌస్‌లో స్ట్ఫా కేంటీన్‌లో తిన్న గడ్డి గుర్తుందా?’
‘ఆ.. నువ్వు బరువు పెరగలేదు. తగ్గలేదు’
‘మీ వాళ్లు నీకన్నా ముందే వచ్చారు’ విల్సన్ చెప్పాడు.
‘మా వాళ్లా?’
జాన్ చేతిలో అప్పటికే ప్రత్యక్షమైన రివాల్వర్ రెండుసార్లు పేలింది. కార్నీ కుప్పకూలాడు. రెండో గుండు టామ్ కుడిభుజంలో దిగింది. ఆ హఠాత్ సంఘటనకి అంతా నిర్ఘాంతపోయారు. జాన్ సహచరుడు బెన్నీ తక్షణం టామ్ హోల్‌స్టర్‌లోని రివాల్వర్ తీసుకున్నాడు. బార్ట్ కార్నీని పరిశీలించి చూసి చెప్పాడు.
‘పోయాడు. సరిగ్గా గుండెలో దిగింది. ఇతను అదృష్టవంతుడు. కొంచెం ఇవతలగా దిగింది’
బెన్నీ, బార్ట్‌లు కార్నీ పడ్డ తివాసీని చుట్టి అతని శవాన్ని వెనక గదిలోకి లాక్కెళ్లారు.
‘చూశారుగా? మీరు పారిపోయే ప్రయత్నం చేయకపోయినా, నిశ్శబ్దంగా ఉన్నా మళ్లీ నా రివాల్వర్ పేలదు. అంతా ఆ సోఫాలో కదలకుండా కూర్చోండి. లేవాలనుకుంటే ముందు చెప్పి, అనుమతి తీసుకుని లేవాలి. లేదా పీటర్ చస్తాడు’ జాన్ వాళ్లని హెచ్చరించాడు.
‘విన్నారుగా? పోయేది పసివాడి ప్రాణం’ టామ్ పరిస్థితి గ్రహించి హెచ్చరించాడు.
‘నేను వెళ్తున్నాను. సరిగ్గా ఐదింటికి మళ్లీ కలుద్దాం’ బెన్నీ చెప్పి వెళ్లిపోయాడు.
వెంటనే జాన్ తనతో తెచ్చిన బ్రీఫ్‌కేస్‌ని తెరిచి అందులోంచి హై పవర్ రైఫిల్‌ని తీసి అమర్చి, కిటికీ దగ్గరికి జరిపిన బల్ల మీద ఉంచాడు.
‘లెఫ్టినెంట్ టామ్ చేతిని చూడటానికి డాక్టర్‌ని కలవాలి’ మేరీ ఆందోళనగా చెప్పింది.
‘డాక్టర్ రాడు. పీటర్ ఇక్కడే ఉంటాడు. మీరెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్‌ని తీసుకురండి. ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వీడి ప్రాణం పోతుంది’ జాన్ ఆజ్ఞాపించాడు.
కోడలు మేరీ, మామ విల్సన్‌లు పక్క గదిలోకి వెళ్లారు. మేరీ ఓ బట్టని చింపుతూంటే విల్సన్ డ్రాయర్ లాగి అందులో బట్టల అడుగున ఉన్న తన రివాల్వర్‌ని తీశాడు. పక్కనే ఉన్న అట్టపెట్టెలోని గుళ్లని తీసి అందులో నింపాడు.
‘మనం ఏదైనా చేసి ప్రెసిడెంట్‌ని రక్షించాలి’ మేరీ మెల్లిగా మామగారితో చెప్పింది.
‘ఏం చేస్తున్నారు? పదండి’
అకస్మాత్తుగా బెర్ట్ లోపలకి రావడంతో విలియమ్స్ రివాల్వర్‌ని డ్రాయర్లోంచి తీయకుండా దాన్ని మూసేశాడు. మేరీ టామ్‌కి రక్తం కారకుండా బేండేజ్‌ని కట్టింది. పీటర్ తన బొమ్మ రివాల్వర్‌ని జాన్‌కి గురిపెట్టి ‘్ఢం! ఢాం!’ అంటూ ట్రిగర్‌ని నొక్కాడు. జాన్ నవ్వాడు. కాని బెర్ట్‌కి కోపం వచ్చి దాన్ని లాక్కుని పక్క గదిలోకి విసిరేశాడు. జాన్ రైఫిల్‌లోకి గుళ్లని అమర్చాడు. డోర్‌బెల్ మోగింది.
‘ఇప్పుడు ఎవరొస్తారు?’ జాన్ అప్రమత్తంగా చూస్తూ అడిగాడు.
‘తెలీదు’ విల్సన్ చెప్పాడు.
‘మేరీ! తలుపు తెరు. ఎవరొచ్చినా లోపలికి రానీకు. లేదా చస్తారు. నువ్వు వారికి ఏదైనా రహస్య సంకేతాలు చేసినా కుర్రాడు చస్తాడు’ జాన్ కఠినంగా చెప్పాడు.
‘మీరు చేసిన హత్యకి సాక్షులైన మమ్మల్ని ప్రాణాలతో వదిలి వెళ్తారని అనుకోను. పోలీసులైతే నిజం చెప్తాను’ మేరీ చెప్పింది.
‘ఏడు గంటల విమానంలో మేం దేశం విడిచి వెళ్లిపోతున్నాం. ఇంక మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు. కాబట్టి సాక్షులు జీవించి ఉన్నా మాకు వచ్చే నష్టం లేదు. పైగా ప్రెసిడెంట్‌ని చంపడానికి నాకు పది లక్షల డాలర్లు ఇస్తున్నారు. నేను ఎవర్నీ ఉచితంగా చంపను’ జాన్ నవ్వి చెప్పాడు.
ఆమె వెళ్లి తలుపు తెరిస్తే చేతిలో పెట్టెతో ఒకతను లోపలికి వచ్చాడు. తనకి రివాల్వర్‌ని గురి పెట్టిన జాన్‌ని చూసి ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఏమిటిది?’
‘సోఫాలో వాళ్ల పక్కన కూర్చో. ఎవరు నువ్వు?’ జాన్ అడిగాడు.
‘టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను.’ అతను సోఫాలో భయంగా కూర్చుని జవాబు చెప్పాడు.
‘నీ పేరేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చినట్లు ఇంకెవరికి తెలుసు?’
‘టెడ్. ఎవరికీ తెలీదు. నా షాప్‌ని మూసేసి వస్తున్నాను. దొంగతనమా? ఇక్కడ అంత డబ్బుందా?’
‘హీరో అనుకోకు. ఒకడు ఇప్పటికే చచ్చాడు. టామ్ భుజంలో గుండు దిగింది’ బెర్ట్ అతన్ని హెచ్చరించాడు.
జాన్ బ్రీఫ్‌కేస్ లోంచి టెలిస్కోప్‌ని తీసి రైఫిల్‌కి బిగించాడు.
‘మీరు అమెరికన్ పౌరులు కారా? మీకు దేశభక్తి లేదా? ఇది చేయకూడని నేరం’ మేరీ బాధగా చెప్పింది.
‘ఇంకొద్దిసేపట్లో ధనవంతుడైన అమెరికన్ పౌరుడ్ని అవబోతున్నాను. నా వరకు ప్రెసిడెంట్ ఓ మనిషి. అంతే’ జాన్ నవ్వుతూ జవాబు చెప్పాడు.
‘నువ్వు దుర్మార్గుడివి’ పీటర్ మళ్లీ అరిచాడు.
‘సరే. నీ రివాల్వర్ తెచ్చుకో. ఇద్దరం కాల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం’ జాన్ నవ్వుతూ చెప్పాడు.
వెంటనే పీటర్ పక్క గదిలోకి పరిగెత్తుకెళ్లి నేల మీద పడ్డ తన బొమ్మ రివాల్వర్‌ని అందుకున్నాడు. వాటి గుళ్ల కోసం డ్రాయర్ని తెరిస్తే విల్సన్ అసలు రివాల్వర్ కనిపించింది. చూస్తే రెండూ ఒకేలా ఉన్నాయి. తన బొమ్మ రివాల్వర్‌ని అక్కడ ఉంచి లోడ్ చేసిన ఆ అసలు రివాల్వర్‌ని తీసుకుని తన హోల్‌స్టర్‌లో ఉంచుకుని మళ్లీ హాల్లోకి వచ్చాడు. జాన్ టెలిస్కోప్ లోంచి స్టేషన్ వైపు చూస్తూ లెన్స్‌ని ఫోకస్ చేస్తూంటే ఆ రివాల్వర్‌ని అతనికి గురి పెట్టి ‘్ఢం! ఢాం! నువ్వు చచ్చావు’ అని నోటితో అని మళ్లీ దాన్ని హోల్‌స్టర్‌లో ఉంచుకున్నాడు.
‘వీళ్లేం చేయబోతున్నారు?’ టెడ్ మేరీని అడిగాడు.
‘అమెరికన్ ప్రెసిడెంట్‌ని చంపడానికి వచ్చారు’
‘సిల్లీ జోక్’
‘నిజం. నీలో దేశభక్తి ఉంటే చెప్పు. ప్రెసిడెంట్‌కి బదులు నీ ప్రాణాలు తీస్తాను. సరేనా? ఈ గదిలో ఎవరినైనా సరే. మీలో ఎవరికి దేశభక్తి ఉంది?’ జాన్ కోపంగా అరిచాడు.
ఎవరూ నోరు మెదపలేదు.
‘నాకు దేశభక్తి లేక కాదు. యుద్ధంలో పాల్గొని ఇరవైఏడు మందిని చంపినందుకు సిల్వర్ మెడల్‌ని సంపాదించాను. ఇప్పుడు డబ్బు కోసమే చంపుతున్నాను. ఓ ప్రెసిడెంట్ మరణిస్తే ఆ స్థానంలోకి ఇంకోడు వస్తాడు. ఏమీ మార్పు ఉండదు’
కొద్దిసేపటికి వారింట్లో ఫోన్ మోగింది. బెర్ట్ దాన్ని తీయబోతే జాన్ వారించి చెప్పాడు.
‘మేరీ! మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పినా నీ కొడుకుని చంపేస్తామని గుర్తుంచుకుని మాట్లాడు’
అతను రిసీవర్ ఎత్తే మేరీ పక్కకి వెళ్లి నిలబడ్డాడు.
‘జాన్? బెన్నీని’
ఆ మాటలు వినగానే జాన్ రిసీవర్ అందుకుని చెప్పాడు.
‘చెప్పు బెన్నీ’
‘రైలు టైంకే వస్తోంది. స్టేషన్ బయట మన కారు సిద్ధంగా ఉంచాను’
‘సరే’
* * *
రిసీవర్ పెట్టేసిన బెన్నీ పబ్లిక్ బూత్‌లోంచి బయటకి వచ్చాడు. అతన్ని గమనించిన ఓ పోలీస్ ఆఫీసర్ అడిగాడు.
‘ఆగు మిస్టర్. నీ పేరు?’
‘ఫ్రెడ్’ బెన్నీ అబద్ధం చెప్పాడు.
‘ఈ ఊళ్లో ఏం చేస్తున్నారు?’
‘సేల్స్‌మేన్‌ని. ఆ పని మీద వచ్చాను’
‘మీ కారేది?’
‘కారులో రాలేదు. రైల్లో వచ్చి ఐదుంపావు రైల్లో వెళ్లిపోతున్నాను’
‘ఐదుంపావు రైలు ఈ ఊళ్లో ఎప్పుడూ ఆగదు - ఇవాళ తప్ప. ఐనా నీకా రైలు గురించి ఎలా తెలిసింది?’
‘ఇలా’ చెప్పి బెన్నీ జేబులోంచి రివాల్వర్‌ని తీసి అతన్ని మూడుసార్లు కాల్చి పరుగెత్తాడు.
రివాల్వర్ పేలిన శబ్దానికి అప్రమత్తమైన కొందరు పోలీసులు అక్కడికి వచ్చి, చెత్త డబ్బా వెనక దాక్కుని కాల్పులు జరిపే బెన్నీని లొంగిపొమ్మని హెచ్చరించారు. అతను లొంగకపోగా వారి మీదకి కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పుల్లో అనేక గుళ్లు వచ్చి అతన్ని తాకాయి.
ఆ తుపాకీ శబ్దాలు విన్న జాన్ తన చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు.
‘బెర్ట్! ఏదో సమస్య. నువ్వు అందర్నీ బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లు. మేరీ! నువ్వు ఇంటి ముందు తోటలో నిలబడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కార్నీ కోసం పోలీసులు రావచ్చు. పావుగంట క్రితమే ఆయన మీ మామయ్యని, పీటర్‌ని తీసుకుని ఎక్కడికో వెళ్లాడని చెప్పు. ఎక్కడికి వెళ్లారో నీకు తెలీదు. వాళ్లు ఇంట్లోకి వస్తే నీతో సహా అంతా చస్తారు. జాగ్రత్త. నేను ఇక్కడ నించి చూస్తూంటాను. భయంగా కాక మామూలుగా ఉండు’
మేరీ బయటకి వెళ్లి మొక్కల ఎండుటాకులని తుంచుతూ నిలబడింది. కొద్దిసేపట్లో అక్కడికి వచ్చిన షెరీఫ్ ఆమెని జాన్ సూచించిన ప్రశ్నలే అడిగితే, అవే జవాబులని చెప్పింది.
‘ఏదో అపశృతి జరిగినట్లుంది?’ మేరీ అడిగింది.
‘ఏం జరగలేదు. అంతా మా ఆధీనంలో ఉంది’ చెప్పి అతను వెళ్లిపోయాడు.
‘కంగ్రాట్స్. అందరి ప్రాణాలని కాపాడినందుకు. కానీ నీ మొహం చూస్తే దయ్యాన్ని చూసిన దానిలా ఉన్నావు’ లోపలకి వచ్చిన మేరీతో జాన్ చిరాగ్గా చెప్పాడు.
‘నాకో అవకాశం వస్తే నిన్ను చంపి తీరుతాను’ మేరీ ఉగ్రంగా చెప్పింది.
జాన్ నవ్వి తన చేతిలోని రివాల్వర్‌ని ఆమె చేతిలో ఉంచి చెప్పాడు.
‘ఏదీ? చంపు’
ఆమె అతని ఛాతీకి రివాల్వర్ గొట్టాన్ని గురి పెట్టింది. కాని చంపలేక కింద పడేసింది.
‘ఓ మనిషిని చంపడం ఎంత కష్టమో అర్థమైందా? ఐనా నేను నీకా అవకాశం ఇవ్వలేదు’ రివాల్వర్‌ని అందుకుని అందులోంచి తీసేసిన గుళ్లని మళ్లీ అమర్చాడు.
‘జాన్! అంతా ఓకేనా?’
‘ఓకే. రావచ్చు’
బెర్ట్ పోలీసులు వెళ్లిపోవడం చూసి నలుగురితో మళ్లీ ఆ గదిలోకి వచ్చాడు.
‘టెడ్. నువ్వు వచ్చిన పని చెయ్యి. ఊరికే కూర్చోక’ జాన్ ఆజ్ఞాపించాడు.
అతను టీవీ దగ్గరకి రిపేర్ చేయడానికి వెళ్తే మిగిలిన అంతా మళ్లీ సోఫాలో కూర్చున్నారు. టీవీ వెనక అతికించి ఉన్న కాగితం మీద పుర్రె బొమ్మ, ‘కాషన్:5000 ఓల్ట్స్’ అని ముద్రించి ఉండటం టెడ్ చూశాడు.
‘మంచినీళ్లు తాగచ్చా?’ టెడ్ అడిగాడు.
జాన్ తల ఊపాక టెడ్ స్టూల్ మీదీ గాజు జగ్‌లోంచి నీళ్లని గ్లాసులోకి వంచుకుంటూ పొరపాటున పడిపోయినట్లుగా జగ్‌ని జారవిడచాడు.
‘మంచి జగ్‌ని విరక్కొట్టావు కదా?’ విల్సన్ అరిచాడు.
‘సారీ విల్సన్. భయంతో చెయ్యి జారింది’ బాధగా చెప్పాడు.
నీళ్లు బల్ల కిందకి పారాయి. రైలు కూత వినిపించడంతో ఆ గదిలో మానసిక వత్తిడి ఏర్పడింది. జాన్ చేతిగడియారం వంక చూసుకుని టెలిస్కోప్‌లోంచి చూస్తూ చెప్పాడు.
‘రైలు సమయానికే వస్తోంది. బెర్ట్. వీళ్లని కవర్ చెయ్యి. ఈ గదిలో ఎవరైనా హీరో అవుదామనుకుంటే విలన్‌ని కాల్చినట్లు కాల్చి చంపేయ్. ఎట్టి పరిస్థితుల్లో మన పది లక్షల డాలర్ల పథకం విఫలం కాకూడదు’
ట్రిగర్ మీద జాన్ వేలు తయారుగా ఉంది. బెర్ట్ ఆ గదిలోని వారినే గమనిస్తున్నాడు. రైలు నెమ్మదిగా ఆగసాగింది.
టెడ్ టీవీ వైర్‌ని బల్ల కిందకి పాకిన నీళ్ల మీదకి విసిరాడు. తక్షణం నీళ్లల్లో కాళ్లున్న బెర్ట్‌కి షాక్ కొట్టి నేలకూలిపోయాడు . అదే సమయంలో పీటర్ రివాల్వర్‌ని జాన్ వైపు తిప్పి పేలుస్తూ ‘్ఢం! ఢాం!’ అని అరిచాడు. కాని ఆ రివాల్వర్ పేలడంతో వాడి మాటలు ఆ శబ్దంలో కలిసిపోయాయి. ఐతే ఆ గుళ్లు జాన్‌కి తాకలేదు. కిటికీలోంచి బయటకి దూసుకుపోయాయి. జాన్ తక్షణం బల్ల మీది తన రివాల్వర్‌ని అందుకుని వాళ్ల వైపు తిరిగాడు. అప్పటికే టామ్ ఆ పిల్లాడి చేతిలోని రివాల్వర్‌ని అందుకుని మరో రెండుసార్లు పేల్చడంతో అవి జాన్ ఛాతీలో దిగాయి. అతను కుప్పకూలిపోయాడు.
సరిగ్గా ఆ సమయంలో ఆ రైఫిల్‌కి ఎదురుగా, సూటిగా అమెరికన్ ప్రెసిడెంట్ కూల్రిడ్జ్ ప్లాట్‌ఫాం మీదకి రైల్లోంచి దిగాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి