హైదరాబాద్

హెచ్చరికల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగడుగునా తనిఖీలు
ప్రార్థన మందిరాల వద్ద
నిఘా ముమ్మరం

హైదరాబాద్, నవంబర్ 23: ఉగ్రవాద దాడులు పొంచి ఉన్నాయన్న నిఘావర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని పారిస్, పశ్చిమాఫ్రికా దేశమైన మాలి రాజధాని బొమాకోలో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ముష్కరుల దాడుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు దేశంలోని మరి కొన్ని నగరాల్లో భద్రతను కట్టు దిట్టం చేయాలని పేర్కొంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాద దాడులు కొత్తేమీ కాదు. గతంలో పలు మార్లు హైదరాబాద్ నగరంతో పాటు పలు మెట్రోనగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పేట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి అమాయకులు బలికాకుండా జాగ్రత్తలు చేపట్టాలని కేంద్రం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్‌లు, మెట్రో, బస్టాండ్‌లతో పాటు విమానాశ్రయ పరిసరాల్లో పోలీసులు బలగాలను మోహరించారు. అదేవిధంగా నగరంలోని ప్రముఖ ప్రార్థన మందిరాలు, ప్రధాన కూడళ్లు, షాపింగ్‌మాల్స్, హోటళ్లు, మార్కెట్‌ల వద్ద జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. జంటనగరాల్లోని ప్రముఖ మార్కెట్‌ల వద్ద సెక్యూరిటీని పెంచడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉండే చోట భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్‌నుమా, లింగంపల్లి, నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లలో ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. అదేవిధంగా గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్టేషన్, పికెట్‌లోని జూబ్లీ బస్టాండ్‌లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎపుడు రద్దిగా ఉండే దిలుసుఖ్‌నగర్, ఎల్‌బినగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఎప్పటికపుడు తనిఖీలు చేసేలా బాంబ్‌స్క్వాడ్‌లను కూడా నగర పోలీసులు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పలు పిక్నిక్ స్పాట్‌లు, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినిపార్క్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజ వంటి అనేక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అనుమానం కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైబరాబాద్‌లోని ఐటి కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో సైతం పోలీసు భద్రతను ముమ్మరం చేశారు.