రాష్ట్రీయం

ఇసిని వెంటనే నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 21: ఏపి ప్రభుత్వం వీలైనంత త్వరగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కామన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగిన అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియ జరగలేదని, ఈ విషయమై ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రావి మాధవరావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన కమిషనర్ కాలపరిమితి ముగిసిందన్నారు. అప్పటి నుంచి ఆ పదవిలో మరెవరినీ నియమించలేదన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను వెంటనే నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.