రాష్ట్రీయం

రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై హైకోర్టు అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపికపై తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రికి లబ్దిదారుల ఎంపిక చేసే బాధ్యతను 50:50 నిష్పత్తిలో అప్పగించడం అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
గత నెల 15న గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ జి.దేవదాస్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టింది. లబ్దిదారుల ఎంపికను కమిటీకి అప్పగించకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా లబ్దిదారుల ఎంపిక చేస్తారని, అందుకు విధివిధానాలు ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులు చట్టవిరుద్దంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
పెద్దకుంట తండా వద్ద అండర్‌పాస్‌పై నివేదిక ఇవ్వండి
మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకుంట తండా వద్ద తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అక్కడ ఉన్న అండర్‌పాస్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఎన్‌హెచ్‌ఐఏ, పోలీసు అధికారులను ఆదేశించింది. ఆసిమ్ అవతార్‌దాస్, మరో ఇద్దరు దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.