రాష్ట్రీయం

రోజాను అసెంబ్లీలోకి అనుమతించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేయాలి
సుదీర్ఘ చర్చల తరువాత నిర్ణయించిన ఏపి సర్కారు
వైఫల్యానికి బాధ్యులంటూ పలువురిపై సిఎం ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 17: వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి. ఈ వ్యవహారానికి ఎలాంటి ముగింపు పలకాలో అర్థంకాని అయోమయంలో ప్రభుత్వం పడిపోయింది. రోజాను శాసనసభలోకి అనుమతించకుండా అడ్డుకునేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ప్రభుత్వం అధ్యయనం చేసింది. రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోతే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించటానికి వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి శాసనసభ్యులతో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. హైకోర్టు ప్రస్తావించిన అంశాలను రాజ్యాంగ ధర్మాసనం ముందు సవాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక పక్క న్యాయస్థానంలో ఈ అంశంపై పోరాడుతూనే వీలైనంత వరకూ మరింత వివాదాస్పదం చేయకుండా అసెంబ్లీలోనే పరిష్కరించే అవకాశాలను కూడా టిడిపి వ్యూహాత్మక కమిటీ అధ్యయనం చేసింది. అందులో ఒకటి రోజాను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం. రెండోది ఆమెచేత సభలో క్షమాపణ చెప్పించడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకడం. ఈ వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ ఇతర న్యాయకోవిదులతో న్యాయశాఖ అధికారులు చర్చించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులను సవరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో అంశాలపై శాసనసభ న్యాయ సలహాదారులు ప్రత్యేకంగా ఉన్నా ప్రభుత్వం తరఫున శాసనసభా వ్యవహారాల శాఖ ద్వారా తాజా పిటిషన్లను దాఖలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ మొత్తం వివాదంలోకి స్పీకర్ కోడెలను తీసుకురాకుండా ఈ నిర్ణయాలపై సభ మొత్తం బాధ్యత వహించేలా జాగ్రత్త పడుతోంది.
యనమలపైకి నెపం
రోజా సస్పెన్షన్ అంశాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రిగా యనమల రామకృష్ణుడు చేపట్టడం ద్వారా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆయనను ఇరకాటంలో పడేశాయి. ఒక దశలో వైఫల్యానికి యనమల బాధ్యుడనే అర్థం వచ్చేలా ప్రచారం జరిగింది. నిబంధనావళిలోని ఇబ్బందులు తనకు తెలిసినా ప్రభుత్వంలోని పెద్దల ఆదేశంతోనే తాను నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని సన్నిహితులు వద్ద యనమల వాపోయినట్టు తెలిసింది.
స్పీకర్‌కు సంపూర్ణ అధికారాలు
ప్రభుత్వంలోని కొంత మంది బాధ్యులు శాసనసభలో తీసుకున్న నిర్ణయాలపై సభకు, స్పీకర్‌కు సంపూర్ణ అధికారాలు ఉంటాయని, వాటిని ఎవరూ ప్రశ్నించజాలరని గతంలో జరిగిన వివిధ సంఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రూల్ 340 సబ్ సెక్షన్ 2 కింద రోజాను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిబంధనను ఉటంకించడంతోనే ప్రభుత్వం నేడు ఇరకాటంలో పడిపోయింది. వాస్తవానికి నిబంధన ప్రస్తావించకుండా ఏడాది పాటు సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఈ నిబంధన ప్రస్తావించకుండా 212 కింద కరణం బలరాంను ఆరు నెలల పాటు శాసనసభ సస్పెండ్ చేసింది.ఉదయం 10.45కు రోజా కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడినప్పటి నుండి అధికార పక్షంలో హడావుడి మొదలైంది. సిఎం చంద్రబాబు మంత్రులను, ఎమ్మెల్యేలను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. కేసులో బలమైన వాదన వినిపించడంలో విఫలమైన న్యాయవాదులపై ఆయన మండిపడినట్టు తెలిసింది. గురువారమే ఈ కేసుపై ఫుల్ బెంచ్‌కు వెళ్లాలని సిఎం వారిని ఆదేశించారు. తీర్పు అసలు ప్రతి రావడానికే సమయం పట్టడంతో దానిపై అప్పీలు చేసే అవకాశం గురువారం అధికారులకు లేకపోయింది.
సభా హక్కుల కమిటీ భేటీ
ఒక పక్క సభా హక్కుల కమిటీ, మరో పక్క స్ట్రాటజీ కమిటీ, ఇంకోపక్క పార్టీ ముఖ్యనేతల సమావేశాలు ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. అన్ని సమావేశాల్లో రోజాను అసెంబ్లీలోకి అనుమతించరాదని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వెంటనే రోజా గతంలో సభలో చేసిన వ్యాఖ్యల సీడీలను, సభ తరఫున డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన వేసిన సబ్ కమిటీ నివేదికను, హక్కుల కమిటీ నివేదికను, అడ్వకేట్ జనరల్‌కు అందజేసి తదుపరి న్యాయ చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. శాసనసభా వ్యవహారాల శాఖ తరఫున ఈ పిటిషన్లను శుక్రవారం ప్రభుత్వం దాఖలు చేయనుంది.
ఎవరి వ్యూహం వారిది
అసెంబ్లీ గేటు వద్దే రోజాను నిలిపివేయాలని శాసనసభ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే రోజాను అడ్డుకునే పక్షంలో అక్కడే కూర్చుని ధర్నా చేయాలని వైకాపా నేతలు యోచిస్తున్నట్టు తెలిసింది.