రాష్ట్రీయం

టెన్త్ పరీక్షా కేంద్రాల్లో సిసిటివి కెమెరాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టుకు తెలిపిన ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు
హైదరాబాద్, మార్చి 17: పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు హైకోర్టుకు తెలిపాయి. సిసి కెమెరాల ద్వారా పరీక్షల నిర్వహణను రికార్డు చేయడమే కాకుండా స్ట్రాంగ్ రూం నుంచి జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లోని సెంట్రల్ మానిటరింగ్ రూంకి అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వాలు వెల్లడించాయి. ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బోసేల్, న్యాయమూర్తి పి.నవీన్‌రావులతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రెండు ప్రభుత్వాలు పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టడంలోనూ, పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించడంలోనూ విఫలమవుతున్నందున కోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. ప్రశ్నపత్రాలు ఉన్న స్ట్రాంగ్ రూంల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 150 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించి ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం ద్వారా మాస్ కాపీయింగ్‌ను అరికట్టే చర్యలు తీసుకున్నామని ఎపి ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. తెలంగాణ తరఫు న్యాయవాది కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ మాదిరిగా మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసును ఏప్రిల్‌కు వాయిదా వేయాలని, ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి, ఎంతవరకు మాస్ కాపీయింగ్‌ను అరికట్టగలుగుతాయనేది అప్పటిలోగా నిర్ధారణ అవుతుందని చెప్పారు. దీంతో ఈ కేసును ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది.