రాష్ట్రీయం

ఉద్యోగాల భర్తీని నిలిపివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైర్‌మెన్, సెక్యూరిటీ గార్డుల నియామకాలపై ఏపి జెన్‌కోకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 4: ఎపి జెన్‌కోలోని విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాల్లో భర్తీ చేయతలపెట్టిన ఫైర్‌మెన్, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపివేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఎపి జెన్‌కోను ఆదేశించారు. గుంటూరు జిల్లాకు చెందిన యలిశెట్టి పార్వతి దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటీషనర్ తరఫు న్యాయవాది ఎస్‌ఆర్ సంకు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు 33 శాతం ఉద్యోగాలను కేటాయించాల్సి ఉండగా, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో ఆ విషయాన్ని స్పష్టం చేయలేదని తెలిపారు.
ఫైర్‌మెన్, సెక్యూరిటీ ఉద్యోగాలకు మహిళలు సరికారనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాలను వారికి కేటాయించలేదని జెన్‌కో అధికారులు తమకు తెలిపారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఆధునిక యుగంలో మహిళలు అంతరిక్షంలోకి దూసుకెళుతున్నారని వివరిస్తూ అలాంటి పరిస్థితిలో చిన్న సెక్యూరిటీ గార్డు, ఫైర్‌మెన్ ఉద్యోగాలకు మహిళలను ఎంపిక చేయకపోవడంలో జెన్‌కో ఉద్దేశ్యం ఏమిటని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
మహిళలంటే వివక్ష చూపడం సరికాదని, అందరికీ సమాన హక్కులు ఉంటే వాటిని విస్మరించడం జెన్‌కో వంటి సంస్థకు మంచిది కాదని సూచించారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ జెన్‌కోకు నోటీసులు జారీ చేశారు. మహిళలకు రిక్రూట్‌మెంట్‌లో చూపిస్తున్న వివక్షకు కారణాలు వెల్లడించాలని, ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు జెన్‌కో ఫైర్‌మెన్, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని ఆదేశించింది.

డ్రగ్స్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీల
యాప్ విడుదల చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్, డిసెంబర్ 4: ఔషధ నియంత్రణ ఇన్‌స్పెక్టర్ల తనిఖీల కోసం ఉద్దేశించిన ఒక మొబైల్ అప్లికేషన్‌ను ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు సచివాలయంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ దరఖాస్తు ద్వారా డ్రగ్స్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు మెడికల్ దుకాణాల్లోనే తనిఖీ పూర్తి చేసి అవసరమైన చోట్ల నోటీసులు సైతం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని మంత్రికి ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ అప్లికేషన్ కేవలం మొబైల్‌తో పూర్తి స్ధాయి తనిఖీ నిర్వహించేందుకు వీలవుతుంది. లైసెన్సుల మంజూరు నుంచి తనిఖీల దాకా తమ శాఖ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నడుస్తుందని ఆయన మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందన్నారు.

హోదాకోసం 7న ఢిల్లీలో మహా ధర్నా
హైదరాబాద్, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో మహా ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ధర్నాకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నామని, ఈ ధర్నాలో పాల్గొంటామని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, ఏపి పార్టీ ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ, పార్టీ అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఎంపీలు పార్టీలకు అతీతంగా గళం విప్పాలని, ఏపికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.