అంతర్జాతీయం

సైప్రస్‌లో హైజాక్ డ్రామా ముగిసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైప్రస్: ఈజిఫ్ట్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్‌ను ఎట్టకేలకు సైప్రస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొన్ని గంటల పాటు నడిచిన డ్రామాకు తెర పడింది. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళుతున్న విమానాన్ని మంగళవారం ఉదయం ఓ వ్యక్తి హైజాక్ చేసి, సైప్రస్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించాడు. తొలుత పిల్లలను, మహిళలను వదిలేసి కొంతమంది ప్రయాణీకులను విమానంలో నిర్బంధించాడు. తన మాజీ భార్యను తీసుకురావాలని తొలుత హైజాకర్ డిమాండ్ చేశాడు. ఆ తర్వాత- ఈజిఫ్ట్ జైలులో ఉన్నవారిని వదిలేయాలంటూ మరో డిమాండ్ చేశాడు. హైజాకర్ ఉగ్రవాది కాదని తేలడంతో పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.