అంతర్జాతీయం

హిల్లరీ, ట్రంప్ మధ్య మాటల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్‌ను స్ర్తిలోలుడిగా అభివర్ణించిన హిల్లరీ
మరి మీ భర్త మాటేమిటి: ట్రంప్ ఎదురుదాడి
వాషింగ్టన్, డిసెంబర్ 31: అమెరికా అధ్యక్ష పదవికి ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అధ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ప్రధాన పోటీదారులైన డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ల మధ్య తాజాగా మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తనను స్ర్తిలోలుడని నిందించడం ద్వారా హిల్లరీ క్లింటన్ ఈ మాటల యుద్ధాన్ని ప్రారంభించారని ట్రంప్ ఆరోపిస్తూ, ఆమె భర్త అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను ప్రపంచంలోనే అత్యంత స్ర్తిలోలురుల్లో ఒకరని ఆరోపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన బిల్ క్లింటన్ వివాహేతర సంబంధాలను మరోసారి ప్రస్తావించిన ట్రంప్, క్లింటన్‌కు బోలెడంత మంది మహిళలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ‘హిల్లరీ క్లింటన్ నన్ను స్ర్తి లోలుడని నిందించారు. ఆమె భర్త ప్రపంచంలోనే అత్యంత స్ర్తిలోలురుల్లో ఒకరు’ అని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. తనను స్ర్తిలోలుడిగా అభివర్ణిస్తూ హిల్లరీ క్లింటన్ చేసిన ఆరోపణలను ట్రంప్ కొట్టివేస్తూ, ఆమె ఇప్పుడు ఆ కార్డును తనకు వ్యతిరేకంగా ఉపయోగించడం ప్రారంభించినందున ఆమె భర్త వ్యవహారాన్ని ప్రస్తావించడం తప్ప తనకు మరోదారి లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో అందరికన్నా ముందువరసలో ఉన్న ట్రంప్ అన్నారు. తనను స్ర్తిలోలుడని అనడం ద్వారా హిల్లరీ క్లింటనే ఈ మొత్తం వివాదాన్ని ప్రారంభించారని ఆయన అంటూ, ఇకపై మనం మాజీ అధ్యక్షుడి (బిల్ క్లింటన్) వెంటపడతామని 2 వేల మందికి పైగా హాజరైన తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ప్రత్యర్థి దెబ్బ కొట్టినప్పుడు మనం అంతకన్నా గట్టిగా తిప్పి కొట్టాలని కూడా ఆయన తన మద్దతుదారులతో అన్నారు. ఇదిలా ఉండగా అధ్యక్ష పదవికోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న తన భార్య హిల్లరీ క్లింటన్‌కోసం నిధులు సేకరించాలని బిల్ క్లింటన్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నలభై ఏళ్లుగా హిల్లరీ తనకు తెలుసునని, ఆమె ఎంతో చురుకైన అంకితభావం కలిగిన వ్యక్తి అని, అధ్యక్షుడు ఒబామా సాధించిన ప్రగతి ఆధారంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మిగతా వారికన్నా సమర్థురాలని బిల్ క్లింటన్ ఇ-మెయిల్ సందేశంలో అన్నారు.