Others

నాకు నచ్చిన పాట -- హిమగిరి సొగసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండవ వనవాసం చిత్రంలో భీముడు, ద్రౌపది కలిసి ఆలపించిన డ్యూయెట్ ‘హిమగిరి సొగసులు/ మురిపించును మనసులు’. ఈ పాట ఇప్పటికీ రేడియోల్లో వినిపిస్తూనే ఉంటుంది. పాట వినగానే మనసంతా హిమగిరులవైపే వెళ్తున్నట్టు అనిపించేంత గొప్ప గీతమిది. ఘంటసాల, సుశీల అద్భుతమైన గానం ఒక వంతైతే, సముద్రాల వారి సాహిత్యం అద్భుతం. రెండూ కలగలిపి చిత్రంలో అద్భుత గీతాన్ని పొందుపర్చారు. వీనులవిందు చేసేలా తీయగా సాగుతుందీ పాట. మధ్యమధ్యలో వచ్చే రాగాలు ఆలాపనలు మరింత ఆనందాన్ని అందిస్తాయి. ‘ఈ గిరినే ఉమాదేవి హరుని వరించెనేమో’ అన్న పాంచాలి ప్రశ్నకు సమాధానంగా భీముడు ‘సుమశరుడు రతీదేవి చేరి అలరించెనేమో’ అని రసవత్తరంగా, మనోజ్ఞంగా చెబుతాడు. భీముడికి డ్యూయెట్ పెట్టడమనేదే విచిత్రం. ఇందులో ఎన్టీఆర్ భీముడిగా ఆ పాటలో ఒదిగిపోయి నటించారు. హిమగిరులలో భీముడు, ద్రౌపది పాటను పాడుతుంటే గగనంలో గంధర్వులు అద్భుతమైన నాట్య విన్యాసాలతో ఆకట్టుకుంటారు. అలా ఈ పాట అటు చెవులకు, కంటికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇప్పటికీ ఈ పాట వింటుంటే ఇంత మంచిపాట మరేది లేదు అనిపిస్తుంది.
-గంగిశెట్టి ఆశామాలతి, చెన్నయ్