మెయన్ ఫీచర్

దేశ చరిత్రను తిరిగి రాయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను! వీరికి కోట వెంకటాచలం పేరు తెలియదు. కల్హణుని రాజతరంగిణి తెలియదు. బెంగాల్‌లోని కాలాపానీ తెలియదు. కాశింరజ్వీ దురంతాలు తెలియవు. గత నవంబర్ 9న కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది.
కిట్టప్ప ఒక సామాజిక కార్యకర్త. వయస్సు అరవై సంవత్సరాలు. కర్ణాటకలోని మడికెరె అనే ప్రాంతంలో ఉంటాడు. దేశ చరిత్రను వక్రీకరించకండి-అంటూ ఒక ఊరేగింపులో పాల్గొన్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కిట్టప్పపై పోలీసులు దాడి చేశారు. లాఠీలతో బాదారు. ఎందరో గాయపడ్డారు. ప్రాణభయంతో అంతా పరుగులు తీశారు. అక్కడ పదిహేను అడుగుల గోడపైనుండి గాయపడిన కిట్టప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఎందుకు జరిగింది? దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏం సమాధానం చెపుతారు??
కర్ణాటకలోని మూడీవాద్రీ అనే గ్రామంలో ప్రశాంత్ పూజారి అనే అట్టడుగు వర్గానికి చెందిన పేద యువకుడు ఉన్నాడు. అతడు పూలు అమ్ముకునే వ్యాపారంతో పొట్టపోషించుకుంటున్నాడు. గోమాతను రక్షించండి- అని పిలుపునిచ్చాడు. అంతే! అతనిని ఉగ్రవాదులు హత్యచేసి కేరళలోకి పారిపోయారు. దీనికి సిద్ధరామయ్య స్పందించలేదు. కనీసం ప్రశాంత్ పూజారికి సానుభూతి కూడా తెలుపలేదు. దీనినిబట్టి తెలిపేదేమంటే మన నాయకులకు దేశభక్తి లేదు. కేవలం ప్రజల ఓట్లమీద మాత్రమే దృష్టి ఉంది. ఓటు బ్యాంకులను కాపాడుకుంటూ అధికారంలోకి వచ్చి కుటుంబ అనువంశిక రాజకీయాలను కాపాడుకుంటూ ఉంటారు. 1947కు ముందు దేశంలో 19 కోట్ల గోవులు ఉండేవి. నేడు కోటి కూడా లేవు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగో లు జాతి వృషభం అదృశ్యమవుతున్నది. అందమైన కొమ్ముల చంద్రగిరి గిత్తలు ఏమైనాయి?? కొంతకాలం క్రితం హైదరాబాదుకు సమీపంలోని యాంత్రిక గోహత్యా కేంద్రం అల్‌ఖబర్‌కు వ్యతిరేకంగా కొందరు ఉద్యమించారు. కాని ఇవ్వాళ ‘నేను గోమాంసం తింటాను. అది నా జన్మహక్కు’ అంటున్నారు కొందరు. గోరక్షణకోసం దిలీపుడు ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఘట్టం కాళిదాసు విపులంగా వర్ణించాడు. ఆవు తరలించుకొని ఇంటి కరిగె శివుడు- ఈ పద్యం శివభారతంలో గడియారం శేషశాస్ర్తీగారు రచించినది. పల్లా దుర్గయ్యగారి గంగిరెద్దు కావ్యం మరచిపోయారా?? ఖండవల్లి లక్ష్మీరాజ్యంగారి ‘దుక్కిటెద్దు కావ్యం’ తెలంగాణ ప్రజలు మరచిపోకూడదు.
అసలీ దేశానికి ఏం జరిగింది? భారతదేశం అంటే ఎన్నికలు- ఓటు బ్యాంకులేనా? సంస్కృతి- నాగరికత వీటి గురించి ఎవరూ ఎందుకు ఆలోచించటం లేదు?? దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. కాని దేశమంటే కులాలోయ్ అని బిహారు ఎన్నికలలో ప్రజలు ప్రత్యక్షంగా నిరూపించారు. తనకంట్లో చల్లుతాడని భయపడి అవతల కులం వాడికి దుకాణందారు కారం అమ్మాడు అని కుందుర్తి ఆంజనేయులు ఒక కవిత వ్రాశాడు. కిట్టప్ప ఎందుకు చనిపోయాడు? కర్ణాటక ముఖ్యమంత్రికి కలలో టిప్పుసుల్తాను కన్పడ్డాడు. నన్ను జనం మరచిపోతున్నారు. నా జయంతి ఉత్సవం చేస్తారా? లేక ఎన్నికలలో నిన్ను ఓడించమంటావా? అని బెదిరించాడు. దానితో సిద్ధరామయ్య భయపడి టిప్పుసుల్తాను జన్మదిన వేడుకలు మొదలుపెట్టాడు. టిప్పుసుల్తాను 18వ శతాబ్దానికి చెందిన మైసూరు పాలకుడు. నా చిన్నప్పుడు హైదరాలీ- టిప్పుసుల్తానుల పాఠాలు చదువుకున్నాను. ఆ పుస్తకాలు సూడో సెక్యులరిస్టులు రచించినవి అని నాకు ఇప్పుడు తెలిసింది. రొమిల్లాథాపర్ ఆర్.ఎస్.శర్మ వకుళాభరణం రామకృష్ణ రాహుల్ సాంకృత్యాయన్ వీళ్లు మన చరిత్ర నిర్మాతలు. వాటిని లక్షలాది చిన్నారులు పాఠ్యగ్రంథాలుగా చదువుకుంటుంటారు. టిప్పుసుల్తాను జీవితాన్ని భగవాన్ గిద్వానీ అనే లాహోరు వాసి ఒక నవలగా వ్రాశాడు. దానిని ఆధారంచేసుకొని పాతికేళ్లక్రితం ఒక టెలీ సీరియల్ నిర్మించారు. అందులో టిప్పుగారు ఛత్రపతి శివాజీ కన్నా గొప్పవాడు అన్నట్లు చిత్రించారు. బ్రిటీషు వారితో పోరాడుతూ టిప్పు అతని కుటుంబ సభ్యులు మరణించారు.
కర్ణాటకలోని శ్రీరంగపట్టణం సమీపంలో టిప్పు కుటుంబం సమాధులు పర్యాటక స్థలంగా మార్చారు. నేను రెండుమూడుసార్లు వెళ్లి చూచి వచ్చాను. ఇదొక అధ్యయన కేంద్రం. టిప్పును ఒక జీహాదీగా కొందరు భావించారు. ఏనుగుల చేత అతడు హిందువులను తొక్కించి చంపించాడు. మలబారులోని లక్షల మంది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్పించాడు. ఇందుకు సంబంధించిన అధికార పత్రాలు చారిత్రక పరిశోధనాంశాలు నేడు స్పష్టంగా అందుబాటులో ఉన్నాయి. వందలాది దేవాలయాలు నేలమట్టం చేయించాడు. అదేమీ లేదు శృం గేరీ మఠానికి టిప్పు బంగారు నాణేలు ఇచ్చాడు అంటున్నారు కొందరు. ఇంత గందరగోళం ఎందుకు జరిగింది? భారతదేశ చరిత్రను బ్రిటీషువారూ రష్యా చైనా మానసపుత్రులూ రచించారా? మన చరిత్రను మనమే రచించలేమా? తాజ్‌మహల్ షాజహాను కట్టెను అని తరతరాలుగా చదువుకుంటున్నాము. ఇది అబద్ధం అని పి.ఎన్.ఓక్ తన ‘బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’అనే గ్రంథంలో నిరూపించారు! అది తేజో మహాలయము అనే శివాలయం అని, అక్కడ మూసివేసిన గది తలుపులు తెరిస్తే సాక్ష్యాధారాలు లభిస్తాయని రాశారు. పి.ఎన్. ఓక్ పేరు ఎవరికీ తెలియదు కాని శ్రీకృష్ణదేవరాయలు పరమ నీచుడు అని రాసిన చరిత్ర కారిణి మహాల్లా రొమిల్లాథాపర్ పేరుమాత్రం అందరికీతెలుసు.
అక్బర్ నిరక్షర కుక్షి. అంద వికారుడు. తన అంగరక్షకుడు బైరాన్‌సింగ్‌ను చంపి అతని భార్యను తన జనానాలో చేర్చుకున్నాడు. కాని చరిత్రలో అక్బర్ ది గ్రేట్ అని వ్రాశారు. రాణాప్రతాప్ గురించి ఒక అధ్యాయం లేనే లేదు. పుష్యమిత్ర శుంగుని పేరు ఎవరికీ తెలియదు. కాని ఔరంగజేబు పరమత సహనము కలవాడు అని వ్రాశారు. నిరాడంబర జీవనుడు అని వర్ణించారు. దానిని విద్యార్థులు చదువుకోవాలా?? ఉస్మానియా యూనివర్సిటీలో నేను ముప్పది సంవత్సరాలు పనిచేశాను. మా డిపార్ట్‌మెంటుకు అవతల ఒకామె ఎం.ఎ. విద్యార్థులకు పాఠం చెపుతున్నది. ఆ పాఠం నా చెవిలో పడింది. ఆర్యులు తెల్లనివారు ద్రావిడులు నల్లనివారు. విదేశాలనుండి ఆర్యులు ఇండియాలోకి ప్రవేశించారు. రాము డు కృష్ణుడు కూడా ఆర్యులే అని చెపుతున్నది. ఒక విద్యార్థి లేచి వాళ్లిద్దరూ నల్లగా ఉంటారు కదా మేడమ్ అని అడిగాడు. ‘నిజమే’ ఇండియాలో ఎండలు ఎక్కువ కదా- అందుకని నల్లబడిపోయారు అని ఆమె సమాధానం చెప్పారు. ఔరా! అని నేను నివ్వెరపోయాను.
సిద్ధరామయ్యకు అకస్మాత్తుగా ఎందుకు టిప్పుసుల్తాను మీద ఇలా ప్రేమ పుట్టింది! అంటే ముస్లిం ఓట్లకోసం. 1947లో రాజకీయ లబ్దికోసం భారతదేశాన్ని మత ప్రాతిపదికపై మూడుముక్కలు చేశారు. ఇందుకు మహమ్మద్ ఆలీ జిన్నా ఎంత కారణమో నెహ్రూ, గాంధీ, రాజగోపాలాచారి కూడా అంతే కారణం. మన సింధూనది మన మొహంజోదారో, హరప్పాలు పాకిస్తాన్‌లోకి పోయాయి. వాటిని దర్శించాలంటే నేడు పాకిస్తాన్‌వారు వీసా ఇవ్వాలి. అంతే దేశ విభజనవల్ల భారతీయులు తమ స్వదేశంలోనే పరాయివారై పోయారు. దీనిని గురించి సిద్ధరామయ్యలూ, లల్లూప్రసాద్‌యాదవ్‌లు ఎందుకు ఆలోచించరు?? ఎన్నికలలో గెలవటం వారు పరివారానికి మంత్రి పదవులు పంచిపెట్టడం- ఇదేనా రాజకీయమంటే!!
మొన్న ఇంగ్లీషు ఛానల్‌లో జరిగిన ఒక చర్చను చూచాను. అందులో ఒక కాంగ్రెసు నాయకుడు ఇలా ప్రశ్నించాడు. కేంద్ర ప్రభుత్వం పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి జరుపుతున్నప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం టిప్పుసుల్తాన్ జయంతి జరిపితే తప్పేమిటి? అని- ఇలా ఆయన ప్రశ్నించడానికి కారణం ఈయనకు టిప్పు జీవితం దీనదయాళ్‌జీ జీవితం రెండూ తెలియవు. టిప్పు దేవాలయాలు ధ్వంసంచేశారు. దీనదయాళ్‌జీ ఇంటిగ్రల్ హ్యూమనిజం ప్రతిపాదించారు. వసుదైక కుటుంబకమే అనే ప్రాచీన ఆర్యోక్తిని గుర్తుచేశాడు. దీనదయాళ్‌జీని నేను చూచాను. అతి సాధారణ జీవితం గడిపేవాడు. చినిగిపోయిన పంచెను సూదిపెట్టి తానే కుట్టుకొని ధరించటం నాకు తెలుసు. జీవితంలో ఏ పదవులూ ఆశించలేదు. అలాం టి వ్యక్తిని 1968 ఫిబ్రవరి 11వ తేదీనాడు హత్యచేశారు. టిప్పుసుల్తానును చంపింది బ్రిటీషువారు కాని దీనదయాళ్‌జీని చంపింది ఈ దేశ పౌరులే. ఇప్పుడు ఏమనుకోవాలి? భారతీయులలో దేశభక్తి ఎంత ఉంది? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది. ‘‘ఈ అసదుద్దీన్ ఒవైసీవల్ల సీమాంచల్ (బీహారు) లో ఓట్లు చీలాయి. లేకుంటే ముస్లిములంతా మూకుమ్మడిగా నాకే ఓట్లువేసి ఉండేవారు’’ అన్నాడు లల్లూప్రసాద్‌యాదవ్. దేశమంటే మనుషులు కారు. దేశమంటే ఓటర్లు!!
(వేదమంత్రాలు జానపదులు పాడుకునే పాటలు’ అని మాక్సుముల్లర్ వ్రాస్తే నాకు విచిత్రం అనిపించలేదు. అది పాశ్చాత్యులు సహజశైలి అనుకున్నాను కాని వేదర్షులు గోమాంస భక్షకులు అని రాహుల్ సాంకృత్యాయన్ వ్రాస్తే ‘అయ్యో’. భారతదేశానికి ఏ గతి పట్టింది? అని బాధపడ్డాను. ‘‘అఘాసుహన్యనే్తగావః’’ (గోహత్య మహాపాపం) అనే ఋగ్వేద గోసూక్తం వీరు చూడలేదా??
న్యూఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డు పేరును అబ్దుల్‌కలాం రోడ్‌గా మారుస్తాము అంటే ఈ మహాపురుషులు ఒప్పుకోవటం లేదు. వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వక్ర చరిత్రను సరిచేసే భిన్న ప్రయత్నం జరిగింది. దానిని ప్రధానంగా సూడో సెక్యులరిష్టులు ఎదుర్కొన్నారు. ఒక సమావేశంలో మురళీమనోహర్‌జోషి (ఆనాటి కేంద్ర విద్యామంత్రి) సరస్వతీ స్తుతితో కార్యక్రమం మొదలుపెడితే సమావేశాన్ని బాయికాట్ చేశారు. ఇంతటి విషయం బహుశా ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు తమ దేశ సంస్కృతి మీద చిమ్మరు. పాఠ్యగ్రంథాలను సరిచేసే ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు పడింది. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట దేశచరిత్ర అధ్యయన గ్రంథాలను పాఠ్యాంశాలను మార్చి ఉండవలసింది. ఆ పని ఇంకా (2016వరకు) మొదలే కాలేదు.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్