11న హితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగపతిబాబు, మీరానందన్ జంటగా విప్లవ్ దర్శకత్వంలో కె.ఎస్.వి. ఫిలింస్ పతాకంపై నిర్మాత కె.ఎస్.వి. నిర్మించిన చిత్రం ‘హితుడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత కె.ఎస్.వి తెలియజేస్తూ, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న విప్లవ్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని, ఈ సినిమా జగపతిబాబులోని అన్ని కోణాల్ని అద్భుతంగా హైలెట్ చేస్తుందని, కోటి అందించిన సంగీతానికి మంచి స్పందన లభించిందని అన్నారు. అరకు, వైజాగ్ తదితర అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఎమోషనల్, మానవ విలువల వేదన, నిర్ణయం తీసుకోవడం, లక్ష్యం సాధించడం అనేది చూపించామన్నారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం:కోటి, కెమెరా:్భరణి కె ధరణ్, ఎడిటింగ్:్ధర్మేంద్ర కాకరాల, దర్శకత్వం:విప్లవ్.