హైదరాబాద్

హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ కీచకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: నగరంలో ఫేస్‌బుక్, ఇంటర్నెట్ ఆన్‌లైన్ చాటింగ్‌తో మహిళలను వేధిస్తున్న సైబర్ కీచకులు పెచ్చుమీరుతున్నారు. నాలుగు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదైనట్టు సైబర్ క్రైం ఇనె్స్పక్టర్ ఒకరు తెలిపారు. ఫేస్‌బుక్ పరిచయాల ద్వారా యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన హైదరాబాదీ అబ్దుల్ మజీద్ (21) గత సంవత్సరం దాదాపు 200మంది యువతులను లోబరచుకుని జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఏడాది పాటు జైలు జీవితం గడిపిన మజీద్ వ్యసనాలకు అలవాటు పడి మళ్లీ యువతులను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వారంతా 21నుంచి 25ఏళ్ల వయస్కులే కావడం విశేషం. విశాఖపట్నం, గుంటూరు, పానిపట్, బెంగుళూరు నుంచి ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తున్న సుమారు 50మందికి పైగా సైబర్ కీచకులను గుర్తించినట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. గత సంవత్సరం 12 కేసులు నమోదు కాగా, ఈ యేడు 10 కేసులను తీవ్ర నేరాలుగా పరిగణించబడ్డాయని, ఈ నాలుగు నెలల వ్యవధిలో దాదాపు 50కి పైగా ఫిర్యాదులు అందాయన్నారు. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫేస్‌ను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న యువకులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను గుంటూరుకు పంపించినట్టు సైబర్ క్రైం ఎసిపి రఘువీర్ తెలిపారు.
పరువుపోతోందని కొందరు యువతులు ఫిర్యాదు చేయడం లేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసిపి వివరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలు, యువతులు తమ ఫొటోలు, వివరాలు పంపకూడదని సైబర్ క్రైం పోలీసులు సూచించారు.