జాతీయ వార్తలు

హాలీవుడ్ సెలబ్రిటీలకు కార్చిచ్చు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు సెగ హాలీవుడ్ సెలబ్రిటీలను తాకింది. అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్‌వుడ్ సహా పలు శివారు ప్రాంతాలు దావాగ్నిలో బూడిదయ్యాయి. అనేక విల్లాలు దగ్ధమయ్యయి. మిలియన్ డాలర్ల విలువ చేసే ఐదు ఇళ్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. సూపర్‌స్టార్ లిబ్రోన్ జేమ్స్, పలువురు ప్రముఖ నటులు, మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. తెల్లవారుజామున లిబ్రోన్ జేమ్స్ ఇంటికి మంటలు అంటుకోవటంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు పరుగులు తీశారు. మాజీ గవర్నర్ అర్నాల్డ్, ఇతర నటీ నటులు మంటలకు పరుగులు తీశారు. సొనోమా కౌంటీలోని కిన్‌కేడ్‌ అడవిలో బుధవారం అర్ధరాత్రి రాజుకున్న కార్చిచ్చు 54 వేల ఎకరాలకు పైగా విస్తరించి కాలిఫోర్నియా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కిన్‌కేడ్‌, శాంటా రోసా, సొనోమా ప్రాంతాల్లోని 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు. అలెగ్జాండర్‌ వ్యాలీలో 1869లో స్థాపించిన ‘సోడా రాక్‌’ మద్యం తయారీ కేంద్రం పూర్తిగా బూడిదైంది. శనివారం నుంచి 28 లక్షల మందికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.