హాలీవుడ్‌కు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య బాలీవుడ్ అందాల భామల క్రేజీ హాలీవుడ్‌లో ఎక్కువైంది? ఇప్పటికే పలువురు నటీమణులు హాలీవుడ్‌లో నటించి తమ సత్తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజాగా అందాల భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. లేటెస్టుగా మరో గ్లామర్ భామ హాలీవుడ్‌కి చెక్కేయనుంది. ఆమె ఎవరో కాదు నీతూచంద్ర. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ, తెలుగులో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తున్న ఈమెకు హాలీవుడ్‌లో ఓ క్రేజీ సీరియల్‌లో నటించే అవకాశం దక్కింది. దాంతో వెంటనే ఆ ప్రాజెక్టుకు ఓకె చెప్పిందట. అంతేకాదు, భాషాపరమైన సమస్యలు రాకుండా ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట. మరి ఈమె హాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి!