గుంటూరు

పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, మార్చి 7: రాజధాని ముఖద్వారమైన సీతానగరం సోమవారం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లోని పలు ప్రదేశాల నుండి భక్తులు విశేషసంఖ్యలో సీతానగరంలోని కృష్ణానదికి విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుఝాము నుండే భక్తులు కృష్ణానదికి చేరుకుని కుటంబసభ్యులతో శివాలయాల్లో పూజలు నిర్వహించారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం నాటికి సీతానగరంలోని ప్రఖ్యాత సోమేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవస్థానం దేవాలయం సముదాయాల్లోని శివాలయంలో భక్తులు విశేషసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. సీతానగరంతో పాటు తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి, గుండిమెడ, చిర్రావూరు, కుంచనపల్లి తదితర గ్రామాల్లోని శివాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా మున్సిపల్ సిబ్బంది సీతానగరంలోని కృష్ణానదీ పుష్కరఘాట్‌ల వద్ద భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం పరిసరాలు శుభ్రం చేసి తాగునీటిని అందుబాటులో ఉంచారు. సీతానగరం మహాశివరాత్రి శోభతో కళకళలాడింది.

విశ్వనగర్‌లో వైభవంగా మహాశివరాత్రి
ప్రత్తిపాడు, మార్చి 7: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడులో గల విశ్వనగర్‌లో సోమవారం మహాశివరాత్రి పర్వదినోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా విశ్వనగర్‌లో పలు ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ స్వయంగా పరమశివుడికి అభిషేకం చేసి భక్తుల చేత అభిషేకం చేయించారు. విశ్వగురుపీఠంలో భక్తులకు ఆశీస్సులు అందజేశారు. రాత్రి శివలింగాకారంలో భక్తులు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులు, రిటైర్డ్ జైలు సూపరింటెండెంట్ సిఆర్‌కె ప్రసాద్, దయానంద్, సాయిరామ్, దత్తాత్రేయశాస్ర్తీ పలువురు భక్తులు పాల్గొన్నారు.

కైలాసగిరిలో మార్మోగిన శివనామం
మేడికొండూరు, మార్చి 7: మహాశివరాత్రి పండుగ సందర్భంగా మండలంలోని పేరేచర్లలో గల కైలాసగిరి క్షేత్రంలో శ్రీ గంగా పార్వతీ సమేత కైలాస సోమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఏకాదశ రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కైలాస ఈశ్వరుడికి కొలుచుకుంటూ కొండపైకి మెట్ల మార్గాన చేరుకుని కైలాసనాథుని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. శివనామస్మరణతో కైలాసగిరి కొండ మార్మోగింది. ఆలయ పరిసర ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. వచ్చే భక్తులకు గ్రామ పంచాయతీ వారు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. అర్చకులు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదం, లడ్డు కౌంటర్లను ఏర్పాటుచేశారు. భారీగా అన్నదానం జరిగింది. మండలంలోని గుండ్లపాలెం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా 48 గంటలపాటు నాల్గవ అఖండ ధ్యానయజ్ఞం నిర్వహించారు. అదేవిధంగా మేడికొండూరు, సిరిపురం, కొర్రపాడుల్లోని శివాలయాల్లో ఉదయం నుండే భక్తులు పూజలు నిర్వహించుకున్నారు.

కిటకిటలాడిన మల్లేశ్వరాలయం
మంగళగిరి, మార్చి 7: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం (శివాలయం) సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుఝాము నుంచే స్వామివారి దర్శనానికి పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, పట్టణ టిడిపి అధ్యక్షుడు నందం అబద్దయ్య, పలువురు అధికార, అనధికార ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యప్రకాశరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్ధరాత్రి దాటాక స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఎదురుకోల నిర్వహించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉన్నతి సోషల్ సేవాసమితి అధ్యక్షురాలు ఎ రాధిక ఆధ్వర్యాన, వాసవి సేవాసమితి ఆధ్వర్యాన ప్రసాదం పంపిణీచేశారు.