రంగారెడ్డి

జోరుగా నవాబ్‌పేట జడ్పీటిసి ఉప ఎన్నిక ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 29: ఎన్నికల్లో కాంగ్రెస్ బి ఫారంతో గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరినవారు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని మాజీ హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నవాబ్‌పేట జడ్పీటిసి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మైతాఫ్తన్‌గూడ, ఎల్లకొండ, లింగంపల్లి గ్రామాల్లో జరిగిన సభలలో ఆమె మాట్లాడారు. ప్రజల నుండి ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ ండి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులకు లేదని చెప్పారు. పింఛను 200 నుండి వెయ్యి రూపాయలకు పెంచామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అఅమలుపర్చలేదని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అర్హులైన వారికి ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ అని హామీ ఇచ్చి విడతల వారీగా చేయడంతో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. అందరికీ ఎల్లపుడూ అందుబాటులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డిని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అపుడే ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్, పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి, అభ్యర్థి మల్లారెడ్డి, వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ కె.అనంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మహ్మద్‌హఫీజ్, మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇంటింటికీ టిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారం
తనను గెలిపిస్తే నవాబ్‌పేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని నవాబ్‌పేట జడ్పీటిసి ఉప ఎన్నిక టిఆర్‌ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని ఎక్‌మామిడి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో అవసరమైన రోడ్లు, మురికినీటి కాలువలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టేందుకు జిల్లా మంత్రి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాను జడ్పీటిసిగా ఎన్నిక కాగానే నిధులు మంజూరవుతాయని తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రజల సంక్షేమం కొరకు అనేక కొత్తపథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వృద్ధ, వితంతు పింఛను రూ.200 నుండి 1000 రూపాయలకు, వికలాంగుల పింఛను రూ.500 నుండి 1500 రూపాయలకు పెంచారని వివరించారు. ఇప్పటికే 50 శాతం ఇచ్చిన రుణమాఫీని త్వరలో మిగతా పూర్తి రుణమాఫీ చేస్తారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రఘుపతిరెడ్డి, నాయకులు రాములు, మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రఘుపంతులు, మహేశ్వర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.
పిలిస్తే పలికే నాయకుడికి ఓటు వేయాలి
పిలిస్తే పలికే నాయకుడిగా మండల ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని నవాబ్‌పేట జడ్పీటిసి ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డి కోరారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో ప్రభుత్వాన్ని నిలదీసి మండలానికి నిధులు తీసుకువస్తామని చెప్పారు. ఏగ్రామానికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రెండు సంవత్సరాలైనా పేదలకు ఇళ్లు ఇవ్వని ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు డబ్బులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. తనకు పోటీ టిఆర్‌ఎస్ అభ్యర్థి రాంరెడ్డితో కాదని, ఎమ్మెల్యే యాదయ్యతోనని స్పష్టం చేశారు. భార్యభర్తల మధ్య పంచాయతీ పెట్టే కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకునే ఉన్న తాము గెలిచినా కాంగ్రెస్‌లో కొనసాగుతామని పేర్కొన్నారు.
డబ్బులు పంచినందుకే..
వరంగల్ ఉప ఎన్నికలో సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ఉండి డబ్బులు పంచినందుకే టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచాడని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కె.ఉదయ్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నవాబ్‌పేట జడ్పీటిసి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నవాబ్‌పేట ఉపఎన్నికలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య టిడిపి అభ్యర్థిగా బిసి సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్‌యాదవ్‌ను పోటీలో నిలిపామని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసింది టిడిపి అని, మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేసింది టిడిపి ప్రభుత్వమని వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోలేని నవాబ్‌పేట జడ్పీటిసి యాదవరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారని చెప్పారు. మిత్రపక్షమైన బిజెపి ఎన్నికలో తమకు మద్దతుగా పనిచేస్తోందని తెలిపారు. టిడిపి అభ్యర్థి వెంకటేశ్ యాదవ్ మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు. నవాబ్‌పేట, శంకర్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జనార్ధన్‌రెడ్డి, మైనార్టీసెల్ నాయకులు అఫ్జల్, జబ్బార్, నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రభాకర్, విజయ్, వెంకటయ్య పాల్గొన్నారు.