సబ్ ఫీచర్

సైక్లింగ్‌లో సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండమాన్, నికోబార్ దీవులకు చెందిన ఇరవై ఏళ్ల దెబోరా హెరాల్డ్ సైక్లింగ్‌లో వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని భారత పతాకాన్ని రెపరెపలాడించింది. యుసిఐ (యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్) ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ యువతి ఇంతటి ఘనతను సాధించడం ఇదే ప్రథమం. కొద్దిరోజుల క్రితం దిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ‘ట్రాక్ ఆసియా కప్ టోర్నీ’కి ముందు ఆమె ర్యాంకు పది కాగా, తాజాగా 500 మీటర్ల ట్రయల్ ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించి భారత జట్టు అంతర్జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచేందుకు ఆమె కారణమైంది. భారత సైక్లింగ్ జట్టు మొత్తం 11 పతకాలను గెలుచుకోగా, అందులో మూడు పతకాలు దెబోరా ఖాతాలో చేరాయి. దక్షిణ కొరియాకు చెందిన చోసున్ యంగ్‌ను మెరుపు వేగంతో వెనక్కినెట్టేసి 13.614 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఆమె స్వర్ణపతకం చేజిక్కించుకుంది. దెబోరా ప్రతిభను భారత సైక్లింగ్ సమాఖ్య ఎంతగానో ప్రశంసించింది. రాబోయే రోజుల్లో దెబోరా ప్రథమ స్థానంలో నిలవాలన్న ఆకాంక్షను సమాఖ్య కార్యదర్శి ఓంకార్ సింగ్ వ్యక్తం చేశారు. సైక్లింగ్‌లోనే కాదు, సునామీని ఎదుర్కొన్న సాహస బాలికగా కూడా దెబోరా గుర్తింపు పొందింది. 2004లో సునామీ విలయం సంభవించినపుడు అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అపుడు దెబోరా వయసు 9 ఏళ్లు. ఆ సమయంలో ఆమె వారం రోజుల పాటు ఒక చెట్టుపై ఉండిపోయింది. సహాయక బృందాలు వచ్చి కాపాడేవరకూ ఆమె ధైర్యంగా ఉంటూ ప్రాణాలను కాపాడుకుంది.
*