రాష్ట్రీయం

ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోగ నిర్ధారణ సేవల ఆధునీకరణ
ప్రైవేటు ఏజన్సీలకు వైద్య పరికరాల నిర్వహణ బాధ్యత
హైదరాబాద్, నవంబర్ 22: ప్రభుత్వాసుపత్రుల దశ తిరగనుంది. ప్రైవేట్ నర్సింగ్ హోంల బారి నుండి పేద రోగులను రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సమాయత్తమవుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలు అందించేందుకు ప్రభుత్వం వినూత్న మైన పథకాన్ని త్వరలో ఖరారు చేయనుంది.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు ప్రైవేట్ నర్సింగ్‌హోంలకు భారీ సొమ్ము చెల్లించి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు విధి విధానాలను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదు వందల కోట్ల రూపాయల వైద్య పరికరాలు ఉన్నా, 200 కోట్ల రూపాయల వైద్య పరికరాలు మూలపడ్డాయి. కొత్త విధానం ప్రకారం వైద్య పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలను వైద్య ఏజన్సీకి అప్పగించనున్నారు. వచ్చే 60 రోజుల్లో వైద్య ఏజన్సీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని వైద్య పరికరాలను మరమ్మత్తు చేస్తారు. వైద్యపరికరాల నిర్వహణను ఔట్ సోర్సింగ్ చేస్తారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ఖరారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపింది. వీటికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరికరాల నిర్వహణ ప్రైవేట్ వైద్య ఏజన్సీలకు అప్పగించారు. ఈ విధానం చక్కగా అమలవుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
వైద్య పరికరాల మరమ్మత్తు, నిర్వహణ కింద వైద్య ఏజన్సీలకు సాలీనా రూ.120 కోట్ల వరకు చెల్లిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రోగ నిర్ధారణ పరీక్షల సర్వీసులు లభించవు. అటువంటి చోట రూ.235ను రోగి చెల్లిస్తే బ్లడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, ఇతర 40 పరీక్షలను చేస్తారు. దీని వల్ల ప్రైవేట్ నర్సింగ్ హోంలకు వందల రూపాయల సొమ్ము చెల్లించి వైద్య పరీక్షలు చేసుకునే బాధ తప్పుతుంది. ఈ వైద్య పరీక్షలను ఇ మెయిల్ ద్వారా కూడా పంపుతారు. లేదా నిర్దేశించిన కౌంటర్ల ద్వారా రోగులకు అందిస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వాసుప్రతుల్లో తీసే ఎక్స్‌రేలను డిజిటల్ రూపంలో రేడియాలజిస్టుల సెంటర్‌కు పంపితే తక్షణమే అధ్యయనం చేసి ఫలితాలను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపుతారు.
బాలింతలు, తల్లులకు ప్రసవం ముందు, ప్రసవం తర్వాత సేవలు అందించేందుకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు ఇస్తారు. దీని వల్ల రాష్ట్రంలో శిశుమృతి రేటును తగ్గించవచ్చునని, ఆరోగ్య శాఖ రాష్ట్రప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది.