బిజినెస్

ప్రభుత్వ సంస్థల కార్పొరేటీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణపై సర్కారు ఆలోచన
పనితీరు మెరుగుపడి, ప్రాధాన్యత పెరుగుతుందన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఖాయిలాపడిన ప్రభుత్వరంగ సంస్థలను తిరిగి పునరుద్ధరించడానికి వాటిని కార్పొరేటీకరించడం చక్కని మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లేదా వాటి మూసివేత దిశగా మాత్రమే ఇప్పటిదాకా ఆలోచిస్తున్నామని, అయితే వాటిని కార్పొరేటీకరణ చేస్తే అవి బాగుపడతాయన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. కార్పొరేటీకరణతో పనితీరు మెరుగుపడి, ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సుకు మోదీ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన దేశంలో సంస్కరణవాదులు పెట్టుబడుల ఉపసంహరణ చేపడితే ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తారు. లేనిపక్షంలో విమర్శిస్తారు. దీనిపై పత్రికలు తమ మొదటి పేజీల్లోనే ‘మోదీ మురదాబాద్, మోదీ మురదాబాద్’ అని పెడుతున్నారు.’ అన్నారు. దాదాపు 85 మేజర్ ప్రాజెక్టులు స్తంభించిపోయాయని, వాటి శంకుస్థాపన రాళ్ళను కూడా కనిపెట్టలేకపోతున్నామన్నారు. అయితే వీటిపై సమీక్షించానని సుమారు 60-65 ప్రాజెక్టుల్లో పని మొదలైందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.
ద్రవ్యలోటు లక్ష్యాన్ని దెబ్బతీయదు: జైట్లీ
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రభుత్వం జాగ్రత్తగా తగ్గిస్తుందని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వంటి అల్పాదాయ వర్గాల రక్షణకు ప్రాధాన్యమిస్తూ దీన్ని చేపడతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శుక్రవారం ఇక్కడ హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో మాట్లాడిన జైట్లీ.. ద్రవ్యలోటు లక్ష్యాలను 7వ వేతన సంఘం నివేదిక దెబ్బతీయబోదన్నారు. పెట్రోల్, డీజిల్‌పై మూడు రెట్లు పెరిగిన సెస్సుతో వచ్చే ఆదాయాన్ని జాతీయ రహదారులు తదితర వౌలిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని 7వ వేతన సంఘం తమ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసినది తెలిసిందే. దీన్ని అమలుపరిస్తే ప్రభుత్వ ఖజానాపై ఏటా 1.02 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను పెట్టుకున్న ద్రవ్యలోటు లక్ష్యం నెరవేరకపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధిరేటు 7.5 శాతానికి పెరుగుతుందన్న విశ్వాసాన్ని జైట్లీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. (చిత్రం) హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ