బిజినెస్

బాండ్ల ద్వారా రూ.1788 కోట్లు సేకరించిన హడ్కో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: ప్రభుత్వ రంగ సంస్థ అయిన హడ్కో పన్ను రహిత బాండ్ల జారీ ద్వారా రూ. 1788.50 కోట్లు సమకూర్చుకుంది. ఈ మొత్తాన్ని ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాల గృహనిర్మాణ ప్రాజెక్టులకోసం ఉపయోగిస్తుంది. మార్చి 2న ప్రారంభించిన హౌసింగ్, పట్టణాభివృద్ధి కార్పొరేషన్ (హడ్కో)కు చెందిన టాక్స్‌ఫ్రీ బాండ్ల ఇష్యూ రూ 8 వేల కోట్ల సబ్‌స్ప్ష్రిన్‌తో ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రెండో విడత టాక్స్‌ఫ్రీ బాండ్ల ద్వారా తాము 1788.50 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నామని, మొత్తం నాలుగు కేటగిరీలు-క్యుఐబి, కార్పొరేట్లు, హెచ్‌ఎన్‌ఐ, రీటైల్‌లు సబ్‌స్క్రైబ్ అయ్యాయని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు. గత జనవరిలో హడ్కో మొదటి విడత టాక్స్‌ఫ్రీ బాండ్ల ద్వారా 1711.50 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. గత నెల కంపెనీ ఫ్రైవేటు సంస్థలకు బాండ్ల విక్రయం ద్వారా 211.50 కోట్లు ఆర్జించింది. అంతకు ముందు సంస్థ మూడు విడతలుగా బాండ్లను ప్రైవేటు పార్టీలకు విక్రయించడం ద్వారా రూ. 1288.50 కోట్లు సమకూర్చుకుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో హడ్కో ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతించిన ప్రకారం 5 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. ఈ ఇష్యూ ద్వారా సమకూర్చుకున్న సొమ్మును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆ తర్వాతి సంవత్సరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులు, కార్యకలాపాలు, ముఖ్యంగా ఇడబ్ల్యుఎస్/ఎల్‌ఐజి కేటగిరీల గృహ నిర్మాణం కోసం ఉపయోగించుకోవడం జరుగుతుందని కంపెనీ తెలియజేసింది.