హైదరాబాద్

శ్లాబ్ కుప్పకూలిన సంఘటనలో మహేశ్వరీ సేవా ట్రస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: జిహెచ్‌ఎంసి అనుమతి లేకుండా కొనసాగుతూ, శ్లాబు కూలిన భవనం తాలుకూ మహేశ్వరి సేవా ట్రస్టు ప్రతినిధులపై క్రమినల్ కేసులు నమోదు చేయాలని మహానగర పాలక సంస్థ అధికారులు స్థానిక హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేనీ ఆలం ఖబూతర్‌ఖానా సమీపంలోని 1767 చదరపు గజాల విస్తీర్ణంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు ట్రస్టు గతంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దరఖాస్తును పరిశీలించి, గత సంవత్సరం ఆగస్టు 13న తిరస్కరించినట్లు తెలిపారు. అయినప్పటికీ అక్రమంగా నిర్మాణం చేపడుతుండటంతో గత ఫిబ్రవరి 20వ తేదీన అడ్డుకునేందుకు వచ్చిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది విధి నిర్వహణకు ట్రస్టు ప్రతినిధులు అడ్డుతగలటంతో తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదే నెల 22వ తేదీన మళ్లీ నిర్మాణం ఊపందుకోవటంతో సమాచారం తెల్సుకుని మరుసటి రోజు సిబ్బంది అక్కడకు చేరుకుని జేసిబితో ఫౌండేషన్‌ను తొలగించిన నేపథ్యంలో సిబ్బందిపై శ్రీనివాస్ బంగ్ అనే ట్రస్టు ప్రతినిధి దూషించటంతో ఆయనతో పాటు మరో 30 మందిపై మరోసారి ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు. వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదై దర్యాప్తులో ఉన్నట్లు వెల్లడించారు. అంతలో ట్రస్టు వారు కోర్టును ఆశ్రయించి ఇంటీరమ్ జంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు, ఈ కేసుకు సంబంధించి 14వ తేదీన విచారణకు రానున్నట్లు కూడా తెలిపారు.