హైదరాబాద్

పేదలకు మరింత అందుబాటులోకి వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 16: వైద్యాన్ని పేదలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి ఆధ్వర్యంలో సుఖీభవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాత్రి సమయంలో రోగుల బంధువులకు భోజనాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు అత్యవసర విభాగంలో కొత్తగా 20 స్ట్రెచ్చర్‌లను సేవాభారతి ఆధ్వర్యంలో ఉచితంగా ఆసుపత్రికి అందించే కార్యక్రమాన్ని మంత్రి పర్యవేక్షించారు. అనంతరం అత్యవసర విభాగంలో శాసన సభా పక్షనాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్.లక్ష్మణ్‌తో పాటు అధికారులు, వైద్యులతో కలిసి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో రోగులను పరామర్శించడంతో పాటు వైద్యసేవలను పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న స్వామి శివానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్మించిన భవంతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది లేరని, అయినప్పటికి ఉన్నవారితోనే నెట్టుకు వస్తున్నట్టు చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీతో ఉన్న సిబ్బందితో ఇబ్బందే అయినప్పటికీ సేవాభారతి లాంటి ఎన్నో సేవా సంస్థలు ముందుకు వచ్చి అన్ని రకాలుగా ఆసుపత్రిలో సేవలు అందించడానికి తమతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. పరికరాలతోపాటు సిబ్బందిని ఇవ్వడం, భోజన వసతి ఏర్పాట్లను ఏర్పాటు చేయడం, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి వైద్యులకు, రోగులకు సహకరించడం లాంటి ఎన్నో మహత్కర కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఎంతోమంది సామాజిక సేవ చేయాలన్న తపన ఉన్నప్పటికీ వారికి సరైన వేదిక దొరకకుండా ఉంటారని అలాంటి వారిని సేవాభారతి ఒక్కతాటిపైకి తీసుకువచ్చి సేవా కార్యక్రమాలను విస్తృత పర్చడం కొనియాడదగిన అంశంగా మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విరివిగా కొనసాగాలని అందరం కలిసి తెలంగాణలోని పేదప్రజలకు సేవ చేద్దామని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదే సమయంలో పుట్టుకతోనే వ్యాధిగ్రస్తులుగా ఉన్న చిన్నారులను గుర్తించి మెరుగైన వైద్యం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.కె.వి.రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. మూర్తి, డాక్టర్. జనార్థన్, డాక్టర్. ప్రతాప్‌రెడ్డి, గుణరంజన్, రేఖాశ్రీనివాస్,సుఖీభవ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుధాకర్, అధికారులు రమణి తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యమంత్రికి వినతిపత్రాలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం గాంధీ ఆసుపత్రికి విచ్చేసిన సందర్భంగా పలువురు ఆసుపత్రి సిబ్బంది తమ గోడును వెల్లబోసుకుంటూ వినతిపత్రాలను అందజేశారు. తమకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి దగ్గర మొరపెట్టుకున్నారు. తమను ఆరోగ్యశ్రీ విభాగం ద్వారా జీఓ నెంబర్ 3లో భాగంగా జీతాలు చెల్లించారని అన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓనెంబర్ 3లో ఉన్న వారిని జీఓనెంబర్ 14లోకి తీసుకురావాలని ప్రకటించిందని అన్నారు. అయితే అందరికీ ఈ నిబంధనను అందుబాటులోకి తీసుకువచ్చి జీతాలు పెంచిన అధికారులు గాంధీ, ఉస్మానియా సిబ్బందిని మాత్రం పక్కన పెట్టారని మంత్రికి తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ సమస్యను పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని వారు మంత్రిని కోరారు. అందుకు మంత్రి సానుకూలగా స్పందించడంతో సిబ్బంది వెనుదిరిగారు.