హైదరాబాద్

బాలయోగి స్టేడియంలో రాష్ట్ర యోగ కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20 : అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యక్రమం గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయుష్ (ఆయుర్వేదం, యునాని, సిద్ధ, యోగ, హోమియో, ప్రకృతి చికిత్స శాఖ) కమిషనర్ డాక్టర్ ఎ.రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, మంగళవారం ఉదయం ఏడు గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జిల్లాల్లో కూడా యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువజన సంఘాలు, విద్యా సంస్థలు, క్రీడామైదానాల్లో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు. మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగాభ్యాసం చేయాలన్నదే ఆయుష్ సంకల్పమని రాజేందర్‌రెడ్డి తెలిపారు.

ప్రైవేటీకరణ దిశగా బల్దియా!

హైదరాబాద్, జూన్ 20: మహానగర పాలక సంస్థ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థ అయిన జిహెచ్‌ఎంసి రాజ్యాంగపరంగా పౌరులకు ఉచితంగా అందించాల్సిన సేవలకు కూడా ఇప్పటికే వెల కడుతుండగా, ఇపుడు తాజాగా రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలోని అన్ని విభాగాల్లో కలిసి సుమారు ఏడు వేల పై చిలుకు మంది పర్మినెంటు ఉద్యోగులుండా, మరో 22 వేల మంది ప్రైవేటు, ఔట్‌సోర్సు సిబ్బంది ఉన్నారు. ఇంజనీర్లు కూడా ఉన్నా, ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా ఫీజుబిలిటీ స్టడీ మొదలుకుని, ప్రాజెక్టుకు అవసరమైన డిజైనింగ్ వేసేది కూడా ప్రైవేటు సంస్థలే. ఆ తర్వాత టెండర్లు దక్కించుకుని పనులు చేసేది కూడా ప్రైవేటు సంస్థలే. జిహెచ్‌ఎంసికి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం ఉన్నా, ఇక్కడి ఇంజనీర్లు ఎందుకు ప్రాజెక్టులకు డిజైనింగ్‌లు చేయరు? అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎం.టి.కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నపుడు జరిగిన బయోడైవర్శిటీ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా రోడ్ల పనులను తనిఖీ చేసిన ఆయన జిహెచ్‌ఎంసి ఇంజనీర్లలో ఏ మాత్రం పని నైపుణ్యత లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేగాక, కాంట్రాక్టు ఎజెన్సీలు, కంపెనీలు చేసే పనులనైనా ఇక్కడి ఇంజనీర్లు కనీసం తనిఖీ కూడా చేయరు. పనుల్లో నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోగా, జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు చేసేదేమిటీ? వారి విధులేమిటీ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరిలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన విధులు నిర్వర్తించే ఉద్యోగులు, కార్మికుల్లో ఎక్కువ మంది ప్రైవేటు, ఔట్‌సోర్సు వారే. ఈ క్రమంలో నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న ప్రభుత్వం జిహెచ్‌ఎంసి ఇంజనీర్లకు ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ వ్యవస్థను సమకూర్చుకుంటే తప్పా, ఆశించిన స్థాయిలో పనులు చేపట్టే పరిస్థితుల్లేవు.
ప్రియమైన ఉచిత సేవలు
మహానగర పాలక సంస్థ ప్రజలకు ఉచితంగా అందించాల్సిన జనన, మరణ ధృవీకరణ పత్రాలకు తొలుత రూ. 7 ఛార్జీలుగా వసూలు చేసి, ఇపుడు ఒక్కో సర్ట్ఫికెట్‌కు రూ. 20 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత కొంతకాలం క్రితం ఈ సర్ట్ఫికెట్ల జారీని మీసేవా, ఈ సేవా కేంద్రాలకు అప్పగించారు. అయితే ఈ కేంద్రాల్లో సర్ట్ఫికెట్ కోసం దరఖాస్తుచేసుకునేందుకు రూ. 30 చెల్లించాల్సి వస్తోంది. దరఖాస్తుల్లో ఏదైనా తప్పున్నా, అది అధికారులు తిరస్కరిస్తారు. సరిచేసి మళ్లీ సమర్పించేందుకు ఒక్కో లావాదేవీకి రూ. 30 చెల్లించాల్సిందే! ఇదే రకమైన ప్రక్రియను ట్రేడ్ లైసెన్సుకు, మోటేషన్‌కు అమలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణను కూడా ఎంతో వ్యూహాత్మకంగా ప్రైవేటు చేశారు. ఇందుకు ఇప్పటికే నియమించిన శుభ్రక్ కార్మికుడు, కొత్తగా పంపణీ చేసిన ఆటో టిప్పర్ల కార్మికులు ఒక్కో ఇంటి నుంచి రూ. 50 నుంచి రూ. వంద వరకు వసూలు చేసుకోవచ్చునని అధికారులు వౌఖికంగా ఆదేశించారు. అంతకు మించి పారిశుద్ధ్య పనులు మొత్తాన్ని రాంకీ ఎన్విరోకు అప్పగించేందుకు ఇదివరకే ఒప్పందం చేశారు. వీటితో పాటు ఇప్పటికే చెత్తను తరలిస్తున్న జిహెచ్‌ఎంసి వాహనాల మరమ్మతుల బాధ్యతను అధీకృత డీలర్లకు అప్పగించిన సంగతి తెలిసిందే! ఇక భవన నిర్మాణ అనుమతుల ప్రస్తావనకు వస్తే ఆన్‌లైన్ సేవలంటూ ఆర్కిటెక్చర్లకు లాభం చేకూరుస్తున్నారు. జిహెచ్‌ఎంసి లైసెన్సు కల్గిన ఆర్కిటెక్చర్లు మాత్రమే వీటిని అప్‌లోడ్ చేయాలన్న నిబంధన విధించారు. దీంతో పాటు గ్రేటర్‌లో అడ్వర్‌టైజ్‌మెంట్ ఫీజును వసూలు చేసేందుకు కూడా యుఎస్‌ఎం అనే సంస్థకు ఏటా కాంట్రాక్టుకు ఇస్తున్నారు. ఈ రకంగా జిహెచ్‌ఎంసిలోని ప్రతి సేవ కూడా ఓ ప్రణాళిక ప్రకారం అధికారులు ప్రైవేటుపరం చేస్తూ వస్తున్నారు.