హైదరాబాద్

మహానీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: బ్రిటీష్ ప్రభుత్వం విధానాల్లో మార్పులు మొదలుకుని కాశ్మీర్ సమస్య పరిష్కారం ప్రత్యేక యాత్రను చేపట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితాంతం దేశ సమస్యలపై పోరాటం చేసిన మహానీయుడని బిజెపి పార్టీ నేతలు కొనియాడారు. అంతేగాక, రాజీలేని జాతీయ భావాలు కల్గిన మహోన్నత వ్యక్తి ఆయన అని గుర్తుచేశారు. గురువారం ఆయన 63వ వర్థంతిని పురస్కరించుకుని బర్కత్‌పురాలోని బిజెపి నగర కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకో కొత్త మలుపు తిరుగుతూ, నేడు దేశ విభజన డిమాండ్ చేస్తున్న కాశ్మీర్ సమస్యపై 1953లోనే ముఖర్జీ ప్రత్యేక యాత్రను ప్రారంభించి, ఆ తర్వాత కన్నుమూశారని వివరించారు. భారతదేశ తొలి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖర్జీ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల విషయంలో కాశ్మీర్ అనుసరిస్తున్న విధానాలతో రాజీపడలేక తన మంత్రి పదవికి రాజీనామా చేయటం ఆయన త్యాగ నిరతికి నిదర్శనంగా వివరించారు.ముఖర్జీ ఆలోచనలు మొదటి నంచి కూడా ఆదర్శవాదంగా ఉంటూ, భారతదేశంలో ఒకే చట్టం, ఒకే విధానం ఒకే జెండా ఉండాలని చాటిచెప్పిన ఘనత శ్యాంప్రసాద్ ముఖర్జీదేనని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు శ్యాంసుందర్‌గగౌడ్, రాజశేఖర్‌రెడ్డ, ఉమా మాహేందర్, మహేందర్, బండారి రాధిక, కవిత, సాధన ఠాకూర్ సూర్యప్రకాశ్ సింగ్ పాల్గొన్నారు.