హైదరాబాద్

ఓనర్ డ్రైవరయ్యాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: జంట నగర ప్రజలకు పౌరసేవలందించటంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించి జిహెచ్‌ఎంసి సమాజసేవలో తనవంతు పాత్ర పోషించిందని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే! అంతేగాక, బ్యాంకు లింకేజీ రుణాలతో ‘డ్రైవర్ కమ్ ఓనర్’ స్కీం కింద నిరుద్యోగులకు ఎంతో ఆర్బాటం చేసి షిఫ్ట్ డిజైర్ కార్లను ఇప్పించిన విషయం విదితమే. అయితే అధికారుల్లో కొరవడిన ముందు చూపు, ఏ పని చేసినా, తొలుత ప్రదర్శించే అత్యుత్సాహాం కారణంగా ప్రారంభించిన కొద్ది నెలలకు ఈ స్కీం తుస్సుమంది. ఈ పథకాన్ని ప్రారంభించే కొత్తలో కారు ఇప్పించటంతో పాటు కారును జిహెచ్‌ఎంసిలోనే ఎంగేజ్ చేస్తామని చెప్పటంతో అనేక మంది నిరుద్యోగులు ఈ కార్ల కోసం పోటీ పడ్డారు. అధికారుల ఆర్బాటపు ప్రచారాన్ని నమ్మి కార్లను తీసుకున్న నిరుద్యోగులు భవిష్యత్తులో ఓనర్లు అయ్యే మాట దేవుడెరుగు గానీ ఇపుడు పరోక్షంగా యజమానులై ఉండి, డ్రైవర్‌గా మారారు. తొలి దశగా మూడు వంద కార్లను నిరుద్యోగులకు అందించిన తర్వాత వంద కార్లను ఎంగేజ్ చేసుకున్న జిహెచ్‌ఎంసి ఒక్కోదానికి నెలకు రూ. 26వేలు చొప్పున చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఎంగేజ్ చేసుకున్న కార్లకు సకాలంలో ఛార్జీలు చెల్లించకపోవటంతో లబ్దిదారులు కనీసం బ్యాంకుకు వాయిదా రుసుము సైతం చెల్లించటం గగనమవుతోంది. ఈ క్రమంలో డ్రైవర్ కమ్ ఓనర్ అన్న గ్రేటర్ స్కీం కాస్త తలకిందులైన ఓనర్ కమ్ డ్రైవర్ కావల్సిన పరిస్థితి తలెత్తింది. అంతేగాక, మలి దశగా పంపిణీ చేసిన కార్ల లబ్దిదారులను సైతం బయట ట్రావెల్స్‌కు అటాచ్ చేసుకుని, బ్యాంకు వాయిదాలు చెల్లించాలని జిహెచ్‌ఎంసి తేల్చి చెప్పటంతో వీరి పరిస్థితి దారుణంగా తయారైంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ వాహనాలపై జిహెచ్‌ఎంసి లోగో, జిహెచ్‌ఎంసి అని రాసి ఉండటంతో పాటు పసుపు పచ్చ ప్లేటు కల్గి ఉండటంతో వీటిలో చాలా మంది కార్ల డ్రైవర్లు గ్రేటర్ పరిధి దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నందున, బయటకు కూడా నడుపుకునేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు వాపోతున్నారు.
ఒక్కసారీ సీజ్ అయ్యిందంటే...!
వరుసగా మూడు నెలల పాటు ఎస్‌బిహెచ్‌కు వాయిదాలు చెల్లించకుంటే ఈ వాయిదాలు వసూలు చేసుకునేందుకు నియమించిన ఎజెన్సీ సిబ్బంది కారును లాక్కొని పార్కింగ్ యార్డుకు తరలిస్తారు. ఒక వేళ లబ్దిదారుడు తల తాకట్టుపెట్టి, చెల్లించాల్సిన వాయిదాల తాలుకూ సొమ్ము తీసుకువచ్చినా, అదనంగా వేలల్లో సీజింగ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు కారు ఎన్నిరోజులు యార్డులో పార్కింగ్ చేస్తే అన్ని రోజుల ఛార్జీలు కూడా అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది.