హైదరాబాద్

భారత్ పోలియో రహిత దేశమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, జూన్ 24: పోలియో వైరస్ అప్పడప్పుడు కనబడడం సహజమేనని, భారతదేశం పూర్తిగా పోలియో రహిత దేశమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. శుక్రవారం అంబర్‌పేట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో పోలియో వైరస్ నిర్థారించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం గోల్నాకాలో పోలియో నివారణ ఇంజక్షన్ పర్యవేక్షణకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారులు అందిస్తోందని, తగిన వ్యాక్సిన్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అదనంగా వ్యాక్సిన్ కావాలన్నా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
ఇప్పటి వరకు రెండు లక్షల పదివేల మంది చిన్నారులకు పోలియో ఇంజక్షన్లను చేసినట్లు ఆయన వెల్లడించారు. అపుడపుడు ఇలా వైరస్ నిర్థారణ అవుతున్నా, పోలియో వైరస్ పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యాధుల నివారణ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా రాష్ట్ర ఫ్రభుత్వం చేస్తోన్న కృషి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి వైరస్‌ను నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నడ్డా వెల్లడించారు. రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలలో 800 కేంద్రాలను ఏర్పాటు చేసి మూడు నుంచి నాలుగు లక్షల పిల్లలకు పోలియో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 26 వతేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిగా అధిగమించనున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. మరోసారి పోలియో వైరస్ బయటపడినా, అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే డా.లక్ష్మణ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, గోల్నాక కార్పొరేటర్ కాలేరు పద్మ వెంకటేశ్, మాజీ కార్పొరేటర్ కాలేరు వెంకటేష్, బి.వెంకట్‌రెడ్డి, సి.కృష్ణగౌడ్, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.