హైదరాబాద్

‘సమన్వయం’ సాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: నగరంలో పౌరసేవల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి తలెత్తే ప్రతి సమస్యకు వివిధ శాఖలతో కొరవడిన సమన్వయమే ప్రధాన కారణమని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ గుర్తించిన లోపాన్ని సరిదిద్దుకుంటున్నారు జిహెచ్‌ఎంసి అధికారులు. కొంతకాలంగా కమిషనర్ నెలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నా, ఇదే సమన్వయం సర్కిల్ స్థాయిలో కూడా కొనసాగాలన్న సంకల్పంతో కమిషనర్ రచించిన వ్యూహం ఫలించింది. గురువారం అన్ని సర్కిళ్ల వారీగా ఈ సమన్వయ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇరవై నాలుగు సర్కిళ్లలో గురువారం ఉదయం వేర్వేరుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు సమన్వయ సమావేశాలు నిర్వహించి భేష్ అన్పించుకున్నారు. ఈ సమన్వయం ఒకరోజుకే పరిమితం కాకుండా మున్ముందు ఇలాగే కొనసాగించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు గాను ప్రత్యేక పర్యవేక్షకులను కూడా నియమించారు. నగరంలో పలు అంశాలైన రోడ్ల మరమ్మతులు, మ్యాన్‌హోల్స్ నిర్వహణ, విరిగి పడిన చెట్ల తొలగింపు, మెరుగైన పారిశుద్ద్యం, ప్రజాసమస్యల పరిష్కారం, జూలై 11న నిర్వహించనున్న హరితహారం, వర్షాకాలం అత్యవసర విధులు, నీటి నిల్వలు, చెత్త తరలింపు, పనులకు భూసేకరణ, ట్రాఫిక్ సమస్యలు వంటి సమస్యలు ఈ సమన్వయ సమావేశాల్లో పరిష్కారం వంటి అంశాలపై విస్త్రృతంగా చర్చించారు. జిహెచ్‌ఎంసి, జలమండలి, మెట్రోరైలు, ట్రాన్స్‌కో, రోడ్లు భవనాలు, ట్రాఫిక్ శాఖల అదికరాలు ఈ సమన్వయ సమావేశంలో క్రమం తప్పకుండా నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్కిళ్ల స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరిగే ఇలాంటి సమావేవాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం సమకూరుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ సమావేశాలు నిరంతరంగా నిర్వహించాలని, ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.