హైదరాబాద్

వర్గీకరణ జోలికొస్తే గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 3: వర్గీకరణ జోలికి వస్తే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు హెచ్చరించింది. ఆదివారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ దళితుల మద్య చిచ్చుపెట్టేందుకే వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ సైతం వర్గీకరణ చెల్లదని తేల్చిచెప్పిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు. దళితులను విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు తీవ్ర వివక్షతకు గురౌతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాలల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత వ్యతిరేక ప్రభుత్వ తీరును సమష్టిగా ఎండగడతామని మాదిగలకు విజ్ఞప్తి చేశారు. మాదిగల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న మందకృష్ణ దళిత జాతిని అప్రదిష్టపాలు చేస్తున్నారని అన్నారు. దళిత వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పకపోతే రాబోవు గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.