హైదరాబాద్

ఈదురు గాలులు.. వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: మహానగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లులు కురుస్తూనే, ఉన్నట్టుండి మధ్యాహ్నం మూడున్న గంటల ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు కూడా వీయటంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఇందిపార్కు, ఆదర్శ్‌నగర్, రెడ్‌హిల్స్ తదితర ప్రాంతాల్లో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. మంగళవారం రాత్రి వరకు కూడా నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఏకధాటిగా పది నిమిషాల పాటు భారీ వర్షం కురవటంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, రాణిగంజ్, లిబర్టీ, విల్లామేరీ, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర జంక్షన్లలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. వర్షం కురిసి ఆగిన తర్వాత నగరంలోని తెలుగుతల్లి, బేగంపేట, ఖైరతాబాద్, సికిందరాబాద్, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్లపై సుమారు కిలోమీటరు వరకు వాహనాలు క్యూ కట్టాయి. బేగంపేట, పంజాగుట్ట, సికిందరాబాద్, జూబ్లీహిల్స్, అసెంబ్లీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షానికి పలు చోట్ల గుంతలమయమైన రోడ్లకిరువైపులా భారీ వర్షపు నీరు నిలిచింది. ఉదయం నుంచే జిహెచ్‌ఎంసి అత్యవసర కంట్రోల్ రూంకు, టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు రావటంతో అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. 113 అత్యవసర బృందాలు, ఆరు సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు, 18 డిసిఎం వాహనాలు, 95 మినీ వాహనాల ఎమర్జెన్సీ బృందాలు భారీగా వర్షపు నీరు నిలిచిన చోట నీడిని తోడేయటం, డ్రెయిన్లను క్లియర్ చేయటం వంటి సహాయక చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో సెల్లార్లలోకి భారీగా వర్షపు నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ముఖ్యంగా మంగళవారం బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో జరిగిన అమ్మవారికి కల్యాణానికి వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారి దర్శనం కోసం వర్షంలోనే క్యూలో నిల్చున్నారు.