హైదరాబాద్

9,10 తేదీల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: జంటనగరాల ప్రజల నీటి సరఫరాను తీరుస్తున్న కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించిన ఘన్‌పూర్ రిజర్వాయర్‌నుంచి కొండపాక పంపింగ్ స్టేషన్ వరకు గల 3000ఎంఎం డయా ఎమ్‌ఎస్ పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా ఈ నెల 9 నుండి మరుసటి రోజు ఉదయం ఆరుగంటలవరకు 20 గంటలపాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. ఫలితంగా ఈ నెల 9వ తేదీన 10వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు జలమండలి ఓ ప్రకటనలో పేర్కొంది.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు
కుత్బుల్లాపూర్, చింతల్, షాపుర్‌నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాలు, జీడిమెట్ల, కూకట్‌పల్లి, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు అన్ని ఫేజులలో, హైదర్‌నగర్, భాగ్యనగర్, ఎల్లమ్మబండ, బాల్‌నగర్, ఫతేనగర్, హఫీజ్‌పేట్, చందానగర్, బొ ల్లారం, మియాపూర్, హుడా కాలనీ, లింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సంజీవరెడ్డినగర్, ఎర్రగడ్డ, వెంగళరావ్‌నగర్, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, వెంకటగిరి, శ్రీనగర్‌కాలనీ, ఎస్‌పిఆర్ హిల్స్, సనత్‌నగర్, బిహెచ్‌ఇఎల్ ప్రాంతాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు నీటిని నిల్వ వుంచుకోవాలని జలమండలి సూచించింది.