హైదరాబాద్

మళ్లీ తెరపైకి కామన్ డక్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: మహానగర పాలక సంస్థ అధికారుల ఆలసత్వం పుణ్యమాని ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోయి, పూర్తిగా గుంతలమయంగా తయారైన రోడ్లు. కొన్ని విఐపి రోడ్లు మినహా మిగిలిన రోడ్ల పరిస్థితి చాలా దారుణం. అడుగడుగున గుంతలు, ఆపై ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలు..ఒకవైపు పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు,మరోవైపు తవ్వకాలు జరుగుతుండటంతో వాహనదారుల ఇబ్బందులు వర్ణణాతీతం. పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు రోడ్డు కట్టింగ్ చేసేందుకు బల్దియా అధికారులు నిర్ణీత గడువును నిర్ణయించినా, రోడ్ల తవ్వకాలు మాత్రం ఏడాది పొడువున ఎపుడు పడితే అప్పుడు కొనసాగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, అమలు కాకపోవటంతో భూగర్భ కామన్ డక్టింగ్‌ను ఏర్పాటు చేయటమే శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ఎస్‌ఆర్‌డిపి పనులు ప్రారంభానికి ముందే కామన్ డక్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు తుది రూపునివ్వాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు తమ అవసరాలకు అనుకూలంగా తవ్వకాలు జరుపుతుండటంతో రీ కార్పెటింగ్ చేసిన కొద్ది రోజులకే రోడ్ల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలను దృష్టిలో పెట్టుకుని బల్దియా అధికారులు ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల అవసరాల కోసం కామన్ డక్ట్‌లను ఏర్పాటు చేసేందుకు మహానగర పాలక సంస్థ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫలించటం లేదు. గతంలో కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నపుడు బిఎస్‌ఎన్‌ఎల్ కన్సార్టియగా పలు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నింటినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి తొలి దశగా బషీర్‌బాగ్ నుంచి లక్డీకాపూల్ వరకు కామన్ డక్ట్‌ను ఏర్పాటు చేసే పనులకు కొంత మేరకు జరిగినట్టే జరిగి, ఆ తర్వాత అర్థాంతరంగా ఆగిపోయాయి. భూగర్భంలో కామన్ డక్ట్‌లను ఏర్పాటు చేయాలన్న ‘మహా’ సంకల్పం ఆరంభంలో శూరత్వంగానే తయారైంది. కానీ ఇపుడు పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేయాలని, తొలి దశగా కనీసం 250 కిలోమీటర్ల మేరకు డక్ట్‌ను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. మహానగరంలో బల్దియాకు చెందిన సుమారు 9 6వేల కి.మీల మేరకు రోడ్లు ఉన్నాయి. టెలిఫోన్, కేబుల్ కంపెనీలు, జలమండలి, విద్యుత్ సంస్థలు, తమ కేబుళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కడబడితే అక్కడ రోడ్లను తవ్వేస్తున్నారు. ఈ సంస్థలు రోడ్డు కట్టింగ్ ఛార్జీలను బల్దియాకు చెల్లిస్తున్నా, బల్దియా అధికారులు మాత్రం తవ్విన రోడ్లకు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవటం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది.